Saturday 30 January 2016

హేమ‌మాలినిపై సీఎం గారికి ఎంత ప్రేమో

0801785014501

అంత‌ర్గ‌తంగా జ‌రుగుతున్న వ్య‌వ‌హరాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని మించిన‌ది లేద‌ని మ‌రోసారి రుజువైంది. ప్ర‌భుత్వాల‌ను కూడా వ‌ణికించ‌గ‌ల‌ద‌ని ఇప్పుడు రుజువుచేస్తోంది. ఆర్టీఐ చ‌ట్టంతో బ‌య‌ట‌ప‌డిన విష‌యాలు ఇప్పుడు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల‌ను అతలాకుత‌లం చేస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారంలో మ‌ధుర ఎంపీ, సినీ న‌టి హేమ‌మాలిని చిక్కుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలినికి ఖరీదైన స్థలాన్ని ఇచ్చి ఆరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సమాచార హక్కు చట్టంతో బయటపడిన ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బాలీవుడ్ నటి – బీజేపీ ఎంపి హేమమాలినికి నెల కిందట ముంబై అంధేరీ ప్రాంతంలో ఖరీదైన స్థ‌లాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంధేరీలో 2వేల చదరపు మీటర్ల స్ధలాన్ని చదరపు మీటరుకు రూ.35 చొప్పున ధర నిర్ణయించి రూ.70 వేలకు ఆమెకు అప్పగిస్తూ కలెక్టర్ దారాదత్తం చేసినట్లు రికార్డులో నమోదైంది. పాలన విధానాల ప్రకారం కలెక్టరు ఇచ్చినట్లు నమోదైనప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆ స్థలం ఆమెకు అప్పగించారు.
కేవలం చదరపు మీటరు రూ.35 ధరకే కారు చౌకగా కేటాయించారు. ఆర్టీఐ కార్యకర్త అనిల్ గాల్గానీ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం బయటపెట్టారు. హేమమాలిని భరతనాట్యం డాన్స్ పాఠశాల కోసం ఈ స్ధలం కేటాయించినట్లుగా రికార్డుల్లో ఉంది. 1976 నియమాల ప్రకారమే స్ధలానికి ధర నిర్ణయించామని అధికారులు వెల్లడించారు. అయితే బీజేపీ ఎంపీ కావడం వల్లే ఆమెకు ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించి తక్కువ ధరకే స్ధలాన్ని ఇచ్చిందని అనిల్ ఆరోపిస్తున్నారు. మొత్తానికి డ్యాన్స్ స్కూళ్ల పేరుతో హేమ స్థలం కొట్టేయడం.. ఆమెకు సీఎం ఫడ్నవీస్ సహకరించడంపై మహారాష్ట్రలోని విపక్షాలు మండిపడుతున్నాయి.

No comments:

Post a Comment