Saturday 2 January 2016

“బ్రా”తో సెల్ చార్జింగ్‌

454450450120


‘స్మార్ట్‌ ఫోన్‌ను రీచార్జ్‌ చేసే డివైజ్‌ను బ్రాలో అమర్చే చిన్న సైజులో సూపర్‌ కెపాసిటర్‌ను తయారు చేశారు బీజింగ్‌ శాస్త్రవేత్తలు. నానో సైన్స్‌ టెక్నాలజీలో దూసుకుపోతున్న బీజింగ్‌ శాస్త్రవేత్తలు మరో అరుదైన ఆవిష్కరణ తెరదించారు. ఆడవాళ్లు ధరించే బ్రాతో స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టుకునే అరుదైన సూపర్‌ కెపాసిటర్‌ను రూపొందించారు. దీని సహాయంతో ఎక్కడైనా, ఎప్పుడైనా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఈ సూపర్‌ కెపాసిటర్‌ను బ్రా లేదా అండర్‌వేర్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ఇంతకు ముందు తయారు చేసిన సూపర్‌ కెపాసిటర్‌లు చాలా పెద్ద‌విగా ఉండ‌డంతో బ్రా సైజును బాగా పెంచాలేమో అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక వీటికి చెక్ చెబుతూ ఈ కెపాసిట‌ర్ల‌ను చిన్న సైజులో రూపొందించారు. ఈ కెపాసిట‌ర్ చిన్న‌గాను..సుర‌క్షితంగాను ఉంది. ఇది డైరెక్టుగా చర్మానికి అంటుకుని ఉండే బ్రా, బికినీల్లో అమర్చినా, దీని వల్ల ప్రమాదమేదీ జరుగద‌ని శాస్ర్త‌వేత్త‌లు చెపుతున్నారు.
సాధారణంగా మనం రేడియోల్లో చూసే కెపాసిటర్ల కంటే చాలా చిన్నదిగా ఉండే ఈ సూపర్‌ కెపాసిటర్‌ వాటి కంటే ఎన్నో ఎక్కువ రెట్లు శక్తిని నిల్వ చేసుకోగలదు. అయితే ఈ సూపర్‌ కెపాసిటర్‌ను బ్రాలో అమర్చడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సూపర్‌ కెపాసిటర్‌ను బ్రాలో అమర్చితే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని కొంద‌రు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక దీని పట్ల సోషల్‌ మీడియాలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే బీజింగ్ శాస్ర్త‌వేత్త‌లు మాత్రం దీనివ‌ల్ల వ‌చ్చిన ప్ర‌మాద‌మేది లేద‌ని…తాము అన్ని ప‌రీక్ష‌లు పూర్తి చేసే దీన్ని రూపొందించామ‌ని చెపుతున్నారు.
please share it..

No comments:

Post a Comment