Saturday 2 January 2016

31న గ్రేట‌ర్‌లో రూ. 120 కోట్లు తాగేశారు

85748504520120

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల్లో భాగంగా డిసెంబ‌ర్ 31వ తేదీ అర్ధ‌రాత్రి మందుబాబులు 120 కోట్ల రూపాయ‌ల మందు తాగేశార‌ట‌. ఈ మందు లెక్క చూస్తే న్యూఇయ‌ర్ వేడుక‌ల‌ను మందు ప్రియులు మ‌స్తుగా ఎంజాయ్ చేశార‌ని తెలుస్తోంది. ఓ ప‌క్క ప్ర‌జ‌ల‌కు ఎంజాయ్‌మెంట్‌.. మ‌రో ప‌క్క తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ‌మే.. ఆదాయం. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబరు 31 ఒక్కరోజునే రూ.200కోట్ల మద్యం బిజినెస్ జరిగిందని అధికారులు లెక్క‌లు తేల్చారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉంచే పబ్ లు.. అర్థరాత్రి పన్నెండు గంటల వరకూ బార్లా తెరిచి ఉంచేలా బార్లు ఉంటే ఏం జరుగుతుంది? అన్న ప్రశ్నకు సరైన సమాధానమే చెప్పారు గ్రేటర్ మందు ప్రియులు. అధికారులు అంచనా వేసినట్లే.. డిసెంబరు 31 ఒక్కరోజునే భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి 31 రాత్రి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని.. ఈసారి రూ.50కోట్ల మేర అదనంగా వ్యాపారం జరిగినట్లుగా వెల్లడిస్తున్నారు.
మద్యం అమ్మకాలు భారీగా పెరగటానికి కారణం షాపులు అధిక స‌మయం తెరిచి ఉంచేలా చేయ‌డ‌మేనంటున్నారు. గతేడాదికి ఈ సారి డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రికి వ్య‌త్యాసాల‌ను ప‌రిశీలిస్తే ఈసారి విదేశీ మద్యాన్ని పెద్దఎత్తున వినియోగించినట్లుగా తెలుస్తోంది. ఒక్క డిసెంబరు 31 రాత్రి మాత్రమే కాదు.. మొత్తంగా డిసెంబరు నెలలోనూ భారీగానే మద్యం అమ్మకాలు సాగినట్లు చెబుతున్నారు. 2014 డిసెంబరులో రూ.1005కోట్ల వ్యాపారం జరిగితే.. 2015 డిసెంబరులో రూ.1250కోట్ల బిజినెస్ జరిగిందని తేల్చారు. అంటే.. రూ.245కోట్లు ఎక్కువన్న మాట. ఇందులో గ‌తేడాది చివ‌రి రోజైన డిసెంబ‌ర్ 31నే రూ.50 కోట్ల అమ్మ‌కాలు అద‌నంగా జ‌రిగాయి.
please share it..

No comments:

Post a Comment