Sunday 3 January 2016

నితిన్ కి షాక్ ఇచ్చిన త్రివిక్రమ్

87708045140

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ తో పని చేయటం అంటే సామాన్య విషయం కాదు. ఇక త్రివిక్రమ్ మూవీలో హీరోగా ఛాన్స్ రావటం కూడ గొప్ప విషయమే. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో నితిన్ కి ఓ విషయంలో త్రివిక్రమ్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘అ .. ఆ’ సినిమాకి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లకి దాటిపోయిందని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ మూవీ ఫైనల్ బడ్జెట్ 34 కోట్ల రూపాయలు అని నితిన్ కి తాజాగా తెలిసిందట. గతంలో ఈ మూవీని 25 కోట్ల రూపాయల్లో త్రివిక్రమ్ పూర్తి చేస్తాడని నితిన్ భావించాడు. ఇక నిర్మాత వద్ద నుండి మూవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న నితిన్ కి, త్రివిక్రమ్ గట్టి షాక్ ఇచ్చాడని అంటున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ సైతం త్రివిక్రమ్ బడ్జెట్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. కానీ నితిన్ మాత్రం తన మూవీకి 34 కోట్ల బడ్జెట్ అనేది చాలా ఎక్కువ అని అంటున్నారు. ఈ మూవీని ఏ విధంగా మార్కెట్ చేసుకుంటారు అనేది నితిన్ కి ఒకింత కన్ఫ్యూజన్ గా ఉందట. ఈ సినిమాలో నితిన్ సరసన సమంతా .. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ మూవీ 80 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం నితిన్ మూవీ బడ్జెట్ మరీ ఓవర్ అయిందని అంటున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం బడ్జెట్ పై 70 శాతం లాభాలు వస్తాయని నిర్మాతలకి భరోసా ఇస్తున్నాడంట.
please share it..

No comments:

Post a Comment