Saturday 19 December 2015

షారుఖ్ సినిమా దిల్ వాలే ఎలా ఉందంటే

షారుఖ్ సినిమా దిల్ వాలే ఎలా ఉందంటే



బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ - కాజోల్ జంటగా మరోసారి నటించిన చిత్రం ''దిల్ వాలే '' . బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ అయిన షారుఖ్ - కాజోల్ లు చాలాకాలం తర్వాత నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ఇక ఈ చిత్రానికి దర్శకులు రోహిత్ శెట్టి కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం ఆశించినంత సక్సెస్ కాలేదు దిల్ వాలే టీం .ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం  రొటీన్ కథ కావడం ,స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకునేలా లేకపోవడంతో కొంత నిరాశ పడటం ఖాయం అయితే ఉన్నంతలో గొప్ప విశేషం ఏమిటంటే షారుఖ్ - కాజోల్ ల కెమిస్ట్రీ మంత్ర ముగ్ధులను చేయడంతో ప్రేక్షకులకు మంచి కిక్ దొరకడం ఖాయం . ఈ ఏజ్ లో కూడా కాజోల్ మరింత గ్లామర్ గా కనిపించి అందరినీ ఆకట్టుకుంది ,షారుఖ్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది కానీ దర్శకుడిగా మాత్రం రోహిత్ శెట్టి మాత్రం విఫలం అయ్యాడు.

No comments:

Post a Comment