Thursday 17 December 2015

సంక్రాంతి రేస్ లో అబ్బాయ్ కూడా

సంక్రాంతి రేస్ లో అబ్బాయ్ కూడా


పెద్ద సినిమాలతో ఈ ఏడాది సంక్రాంతి పండగ చాలా ఆసక్తినే రేకిస్తోంది. బాబాయ్ బాలకృష్ణ తో, అబ్బాయ్ ఎన్టీఆర్ సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద డీ కొట్టనున్నాడు.
n
అయితే సంక్రాంతి  రేసులో ఎన్టీఆర్  లేడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ తండ్రి అకస్మాత్తుగా  చనిపోవడం తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవుతున్నాయని, అందువల్ల ఎన్టీఆర్ సంక్రాంతి భరిలో లేడని ప్రచారం జరిగింది. కాని తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఎట్టి  పరిస్థితుల్లో సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో ' విడుదల చేయనున్నాడట. దేవి తండ్రి మరణం ఇచ్చిన షాక్ నుండి త్వరగా బయటపడాలంటే, తన మైండ్ ని వర్క్ ఫై పెట్టడమే సరి అని భావించి ఇప్పటికే ఆర్ ఆర్ పనులు మొదలు పెట్టాడట. ఎట్టకేలకు సంక్రాంతి భరిలో అబ్బాయ్ బాబాయ్ డీ కొట్టనున్నారన్న మాట.       

No comments:

Post a Comment