Friday, 5 February 2016

ఏషియన్ ఫిలిం అవార్డ్ కి బాహుబలి నామినేట్



ఏషియన్ ఫిలిం అవార్డ్ కి బాహుబలి ఎంపికయ్యింది . బాహుబలి కి పేరు వచ్చిందే విజువల్ ఎఫెక్ట్స్ వల్ల ..... అటువంటిది ఆ విభాగానికే నామినేట్ కావడంతో బాహుబలి యూనిట్ చాలా సంతోషంగా ఉంది . పదవ ఏషియన్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి బాహుబలి నామినేట్ కాగా ఇదే అవార్డ్ కోసం 9 దేశాల నుండి 36 చిత్రాలు పోటీ పడుతున్నాయి . చైనా ,సౌత్ కొరియా ,జపాన్ లతో పాటు ఇండియా నుండి నామినేట్ అయ్యాయి . మరి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డ్ ని కొట్టేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఈనెల 17 వరకు ఎదురు చూడాల్సిందే . ఎందుకంటే ఆరోజే ఈ అవార్డులను ప్రకటించనున్నారు.

No comments:

Post a Comment