తమ ఇద్దరు క్లాస్‌మెట్స్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ముగ్గురు మైనర్ విద్యార్థులకు కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. దక్షిణ కాలిఫోర్నియాలో చదువుతున్న ఈ ముగ్గురు విద్యార్థులు తమ తోటి స్నేహితురాళ్లపై దారుణంగా దాడి చేసి కొట్టి గాయపరిచారు. ఇంతకు వీరు తమ మైనర్ స్నేహితురాళ్లను అంతగా కొట్టగానికి రీజన్ ఏంటో తెలుసా…వీళ్లను సరిగా గౌరవించడం లేదట.
తమను తమ స్నేహితురాళ్లు గౌరవించడం లేదని కోపం వ్యక్తం చేస్తూ వీరు 16 ఏళ్ల స్నేహితురాలిపై రోలాండ్ హైట్స్ లోని రెస్టారెంట్, పార్కులో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం రెండు రోజుల తరువాత 18 ఏళ్ల మరో క్లాస్‌మెట్‌ను బెదిరించి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బట్టలూడదీసి, తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె నగ్న శరీరంపై సిగరెట్‌తో కాల్చారు. ఈ విధంగా ఐదు గంటల పాటు ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఓ బాలుడితో ఉన్న వివాదం కారణంగా, రెస్టారెంట్ బిల్ కట్టనందుకు నిందితులు ఆ బాలిక పై దాడి చేశారు. కాగా, కోర్టులో నిందితులు నేరం రుజువుకావడంతో యాన్‌యో హెలెన్ కు 13 ఏళ్లు, యుహాన్ కోకో యాంగ్‌కు 10 ఏళ్లు, జింగ్‌లీ జాన్ జంగ్‌కు 6 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది.
No comments:
Post a Comment