సాధారణంగా ప్రకటనలంటే టీవీల్లోనో, పేపర్లలోనో వస్తుంటాయి. అలాగే గోడలపైన, వీధుల్లోని
పెద్ద పెద్ద హోర్డింగ్‌లపైనా ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీ తమ ఉత్పత్తులను ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా చేయాలంటే భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వడం తప్పనిసరి. ఇండియా లాంటి దేశాల్లో ప్రకటనలంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు మీడియా, సోషల్ మీడియాలోనే ఎక్కువగా చూస్తుంటాం. అయితే పాశ్చాత్య దేశాల్లో వీటితోపాటు అందమైన అమ్మాయిల నుదురు భాగాలను, భుజం తదితర అంగాలను కూడా వ్యాపార ప్రకటనల నిమిత్తం వాడుతుంటారు. అయితే ఇప్పుడు విక్టోరియా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కాల్‌గాళ్స్.. తమ పూర్తి శరీరాన్నే ఎడ్వర్టైజింగ్‌కు వాడుకునే అవకాశమిచ్చే దిశగా ఆలోచిస్తోంది.
ఈ మేరకు విక్టోరియా సెక్స్ వర్కర్స్ అర్గనైజేషన్, ప్రభుత్వం మధ్యన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు భుజం, నుదురు, ఉదర భాగాలను మాత్రమే యాడ్స్ కోసం వినియోగించుకునే వీలుండేది. ఈ చర్చలు ఫలవంతమైతే రహస్యాంగాలను కూడా వినియోగించుకునే వీలుంటుంది. అమ్మాయిల శరీరాన్ని యాడ్స్ కోసం వాడుకున్నందుకు వారికి భారీగానే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment