Thursday, 7 January 2016

యాపిల్ సీఈవో జీతం తెలిస్తే షాక‌వ్వాల్సిందే

5605605201201

మార్కెట్‌లో ఎప్పుడూ స‌రికొత్త ఫోన్ వ‌స్తూనే ఉంటుంది.. కానీ అలాంటివి ఎన్ని వ‌చ్చినా `ఐఫోన్‌`కుండే క్రేజ్ వేరు.. ఈ ఫోన్ విడుద‌ల‌యింద‌ని తెలిస్తే చాలు.. సంబంధిత స్టోర్ ముందు జ‌నాలు క్యూ క‌డ‌తారు.. మొద‌టిరోజే హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.. ధ‌ర గురించి అస్స‌లు ఆలోచించే ప్ర‌సక్తే ఉండ‌దు.. మ‌రి అలాంటి క్రేజ్ సంపాదించుకున్న సంస్థ యాపిల్‌. వీటిని బ‌ట్టి లాభాలు కూడా భారీగానే ఉంటాయ‌ని ఊహించుకోవ‌చ్చు.. మ‌రి ఆసంస్థ‌ను ఇలా లాభాల బాట‌లో దూసుకెళ్లేలా చేస్తున్న సీఈవో జీతం ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ ఊహించండి.. సుమారు రూ.10 కోట్లు… రూ.25కోట్లు… పోనీ రూ.40 కోట్లు అంటారా! ఇలా అనుకుంటే మీరు ఐఫోన్ మీద కాలేసిన‌ట్టే.. యాపిల్ సీఈవో జీతం అక్ష‌రాలా రూ.69 కోట్లు. ఇంకో విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే.. సీఈవో క‌న్నా ఆ కంపెనీలో ఉండే ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అంత‌కు రెట్టింపు ఉంటాయి.
ఐఫోన్‌లు, ఐ ప్యాడ్‌లు విక్రయించే యాపిల్‌ సంస్థ గత ఏడాది భారీ లాభాలు ఆర్జించింది. 2015లో సంస్థ అమ్మకాలు 28శాతం పెరిగి.. లాభాలు 38 శాతం పెరిగాయి. దీంతో యాపిల్‌ సీఈవో టిమ్‌ కూక్‌ వేతనం కూడా పెరిగింది. 2015లో ఆయన వేతన 11.5శాతం పెరిగి 10.3 మిలియన్ డాలర్ల (రూ. 69 కోట్ల)కు చేరుకుంది. ఇక యాపిల్‌ కంపెనీలో సీఈవో కూక్‌ కన్నా ఇతర ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అధికంగా ఉండటం గమనార్హం. గత ఏడాది యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి లుకా మేస్ట్రీ వేతనం 81శాతం పెరిగి 25.3 మిలియన్ డాలర్ల (రూ. 169 కోట్ల)కు పెరిగింది. అదేవిధంగా రిటైల్, ఆన్‌లైన్ స్టోర్స్‌ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ ఏంజెలా ఎరెండట్స్‌ వేతనం భారీగా పెరిగి 25.8 మిలియన్ డాలర్ల (రూ. 172 కోట్ల)కు చేరుకుంది. 2015లో కూక్‌ మౌలిక వేతనం 14.4 శాతం పెరిగి రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకోగా, ఆయనకు చెల్లించే నాన్ ఈక్విటీ పరిహారం 19శాతం పెరిగి 8 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కూక్‌ నేతృత్వంలో 2015 యాపిల్‌కు బాగా కలిసొచ్చింది. చైనాలో యాపిల్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఐఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగాయి. మ‌రి యాపిల్ కొన‌డానికే కాదు.. అందులో ఉండే జీతాలు ఎంతో వింటేనే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి క‌దూ!
please share  it..

No comments:

Post a Comment