30 బంతుల్లో 90: గుఫ్తిల్ రికార్డ్, డివిల్లీయర్స్ పేరిటే..
క్రైస్ట్ చర్చ్: కివీస్ స్టార్ మార్టిన్ గుఫ్తిల్ విధ్వంసక ఆట తీరుతో చెలరేగాడు. శ్రీలంక బౌలర్లను చీల్చి చెండాడుతూ కివీస్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. దొరికిన బౌలర్‌ను దొరికినట్లు చితకబాదిన గుఫ్తిల్ 30 బంతుల్లో 93 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న రెండో ఓవర్ నుంచే పరుగుల ప్రవాహాన్ని మొదలుపెట్టిన గుఫ్తిల్ వన్డేల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డుకు పరుగు దూరంలో ఆగిపోయాడు. గతంలో సఫారీ సూపర్‌మ్యాన్ డివిలియర్స్ వెస్టిండీస్‌పై 16 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అది మదిలో మెదిలిందో లేదో కాని గుఫ్తిల్ 17 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. చమీరా వేసిన మూడో ఓవర్లోనైతే గుఫ్తిల్ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 27 పరుగులు పిండుకున్నాడు. ఇదే ఊపును చివరి దాకా కొనసాగించిన గుఫ్తిల్.. జెఫ్రీ వేసిన ఆరో ఓవర్లో మళ్లీ మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ టిమ్ లాథమ్(17నాటౌట్)తో కలిసి గప్టిల్ కివీస్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
కాగా, గుఫ్తిల్ 30 బంతుల్లో 8 సిక్స్‌లు, 9 ఫోర్లతో 93 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ చేసిన విధ్వంసం అందర్నీ కట్టిపడేసింది. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ గుప్తిల్ చేసిన బ్యాటింగ్ విన్యాసంతో శ్రీలంకపై న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌పై 10 వికెట్ల తేడాతో శ్రీలంక పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కివీస్ బౌలర్ల ధాటికి 27.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కులశేఖర చేసిన 19 పరుగులే అత్యధికం. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫలమైన చోట కివీస్ ఓపెనర్లు పరుగుల సునామీనే సృష్టించారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 8.2 ఓవర్లలోనే 118 పరుగులు చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ గుప్తిల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 93 (30 బంతుల్లో) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మరో ఓపెనర్ లాథమ్ 17 పరుగులు గుప్తిల్‌కు సహకారం అందించాడు. న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో 14.16 రన్ రేట్‌తో లక్ష్యాన్ని చేధించింది. కివీస్ 10 వికెట్ల భారీ విజయం సాధించింది. ఇది న్యూజిలాండ్‌కు రెండో అత్యధిక రన్ రేట్. వన్డేల్లో రెండో వేగవంతమైన అర్థశతకం (17 బంతుల్లో) సాధించిన మూడో బ్యాట్స్‌మెన్ (జయసూర్య, పెరీరా తర్వాత)గా గుప్తిల్ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌పై శ్రీలంకకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గతంలో న్యూజిలాండ్‌పై 112, 115 పరుగులకు శ్రీలంక ఆలౌటైంది.
please share it

No comments:
Post a Comment