Tuesday 2 February 2016

పొలాల‌కు దిష్టి త‌గ‌ల‌కుండా సన్నీలీయోన్ ఫ్లెక్శీలు

8708404501201

ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్ యూ ట‌ర్న్ తీసుకుంటోంది. కాలానుగుణంగా.. అన్నీ మారుతున్నాయ్‌. ఆఖ‌రికి దిష్టి బొమ్మలు కూడా..! అందుకే ఇప్పుడు అనుష్క, సన్నీ లియోన్‌ వంటి అందాల తార‌ల ఫొటోలు కుర్ర‌కారుకే కాదు రైతుల‌కూ అత్యంత అవ‌స‌రం అయిపోయాయ్‌. ఎందుకంటే ఇవే ఇవాళ వారి పంట‌పొలాల‌కు దిష్టిబొమ్మ‌లు గ‌నుక‌. వివ‌రాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా , చింతలపూడి మండలంలోని అనేక గ్రామాల్లో స‌న్నీ.. స్వీటీ..వంటి తార‌ల హాట్‌ హాట్‌ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇలా అశ్లీల ఫ్లెక్సీలు పెట్టడంలో తమ తప్పేమీ లేదని రైతులు వాదిస్తున్నారు. పొలాల్లో అశ్లీల పోస్టర్లను పెట్టడంలో వేరే ఉద్దేశమేమీ లేదని… తమ పొలాల‌కు దిష్టి త‌గ‌ల‌కుండా ఉండేందుకే.. ఈ పద్ధతిని అనుసరిస్తున్నామని చెబుతున్నారు.
మట్టికుండలైనా, దిష్టిబొమ్మలనైనా పెట్టేది పొలాలకు నరదిష్టి తగలకుండానే కదా? అందుకే.. పొలానికి దిష్టి త‌గ‌ల‌కుండా.. మ‌ట్టికుండలు.. గ‌డ్డిబొమ్మ‌లు ఉంచే బ‌దులు అతి చవగ్గా లభించే ఫ్లెక్సీలను పెడుతున్నామని రైతులు సమర్థించుకుంటున్నారు. ఫ్లెక్సీల వల్ల జనాల దృష్టంతా వాటి మీదకు మళ్లి.. పంట‌కు ఎలాంటి దిష్టీ తగలదన్న‌ది వారి వాదన. సంప్ర‌దాయ‌వాదులు మాత్రం ఈ విధానాన్ని త‌ప్పుప‌డుతున్నారు. కాలానుగుణంగా ప‌ద్ధ‌తులు మార‌వ‌చ్చు..మరీ! ఇలా అశ్లీల ఫ్లెక్సీలు పెట్టడం ఏమంత మంచి పద్ధతి కాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద పశ్చిమగోదావరి రైతులు మాత్రం దిష్టిబొమ్మ‌ల ఏర్పాటు విషయంలో ట్రెండ్‌ సెట్టర్స్‌గా మార‌డం విశేషం.

No comments:

Post a Comment