Sunday 14 February 2016

బీజేపీ అధ్య‌క్ష పీఠం మ‌ళ్లీ “క‌మ్మ” కేనా.. ?

408504501201

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అంత‌టా కాపుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌, రిజ‌ర్వేష‌న్ల ప్ర‌క్రియ‌తో కదంతొక్కుతోంది. రాష్ట్రంలో క‌మ్మ‌.. కాపు అని చ‌ర్చ‌లు.. సినిమాల‌తో హోరెత్తుతుంటే రాష్ట్ర బీజేపీ మాత్రం మరోసారి కమ్మ సామాజిక వర్గానికే అధ్యక్ష కిరీటం పెట్టడానికి రెడీ అవుతోందట. కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి, కావూరు సాంబశివరావుల పేర్లు ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో వినిపిస్తున్నాయి. పురంధేశ్వరి విశాఖ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తరువాత రాయలసీమకు వలస వెళ్లారు. తనను అయిదేళ్ల పాటు విశాఖ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారన్న సంగతినే ఆమె మర్చిపోయారు.
ఇక కావూరి సాంబ‌శివ‌రావు బీజేపీలో ఉన్నా చంద్రబాబుకు అన్ని విధాలా కావాల్సిన వ్యక్తి. బంధుత్వమూ వుంది. అందుకే ఆయనకే చాన్స్ వుందని అంటున్నారు ప‌లువురు. అయితే మధ్యలో సోము వీర్రాజు పేరు కూడా వినిపిస్తోంది. గోదావరి జిల్లాకు చెందిన ఈ కాపు సామాజిక వర్గ నేతకు కాస్త నోటి స్పీడు ఎక్కువ. చంద్రబాబుపై ఊ అంటే..విరుచుకు పడుతుంటారు. వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మద్దతు వుందని టాక్. ఈ ముగ్గురి మ‌ధ్య పోటీ ఎలా ఉన్నా ఫైన‌ల్‌గా ఢిల్లీ స్థాయిలో ప‌రిచ‌యాలు బాగా ఉన్నా కావూరి లేదా పురందేశ్వ‌రికే ఏపీ బీజేపీ ప‌గ్గాలు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని ఎక్కువ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.

No comments:

Post a Comment