Wednesday 17 February 2016

స్వచ్చంద వ్యభిచారం తప్పు కాదు – సుప్రీంకోర్టు

07104501425010

సెక్స్ వర్క‌ర్ల విష‌యంలో సుప్రీంకోర్టు నియ‌మించిన ఓ ఫ్యానెల్ షాకింగ్ తీర్పు ఇచ్చింది. సెక్స్ వర్కర్లు సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పుడు పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు నియమించిన ఆ ప్యానెల్ సూచించింది. వేశ్యల హక్కుల పరిరక్షణకు, వారికి మెరుగైన పనితీరు వాతావరణం కల్పించడానికి 2011లో ఏర్పాటైన ఈ ప్యానెల్‌ వచ్చే నెలలో తన నివేదిక సమర్పించనుంది. ‘స్వచ్ఛంద సెక్స్ వర్క్‌ అక్రమం కాదు కానీ, బ్రోతల్ హౌస్‌ నిర్వహించడం చట్టవ్యతిరేకం. ఈ నేపథ్యంలో బ్రోతల్ హౌస్‌లపై పోలీసులు దాడి చేసినప్పుడు సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడంగానీ, జరిమానా విధించడంగానీ, వేధించడంగానీ చేయరాదు’ అని ప్యానెల్ పేర్కొంది.
వేశ్యవృత్తి ఒకరకంగా చట్టబద్ధమే అయినా కొన్ని చట్టాల వల్ల రెడ్‌లైట్ జిల్లాల్లో సెక్స్ వర్కర్లు పోలీసుల చర్యలకు బలవుతున్నారని ప్యానెల్ అభిప్రాయపడింది. అక్రమ మానవ రవాణాను అరికట్టే విషయంలో పోలీసులు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారు. ఉమ్మడి సమ్మతితో వ్యభిచారంలో పాల్గొన్నా.. సెక్స్ వర్కర్లపై, విటులపై చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ నేతృత్వంలోని ప్యానెల్ అభిప్రాయపడింది. తాజా తీర్పుతో సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు త‌మ వృత్తి విష‌యంలో చాలా ఫ్రీడ‌మ్ ల‌భించిన‌ట్ల‌య్యింద‌న్న వ్యాఖ్య‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

No comments:

Post a Comment