Friday 19 February 2016

చుక్క కోసం ఐసీయూ నుంచి వ‌చ్చేశాడు

480485120

ముందు బాబుల‌కు ర‌క‌ర‌కాల పిచ్చిలు ఉంటాయి. వారు మందు కోసం ఏమైనా చేస్తారు..మందు కొట్టాక ఏదైనా మాట్లాడ‌తారు. ఓవ‌రాల్‌గా వారు మందు లేక‌పోతే ఉండ‌లేరు. మామూలుగా ఉన్న‌ప్పుడు మందు పిచ్చి ఉంటే ఓకే. అయితే ఓ వ్య‌క్తి భారీ యాక్సిడెంట్‌కు గురయ్యి ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందూతూ కూడా మందు కోసం లేచి ఆసుప‌త్రి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో అక్క‌డున్న‌వారంతా షాక్‌కు గుర‌య్యారు. ఈ షాకింగ్ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. సైబీరియాకు చెందిన ఓ వ్యక్తి భారీ యాక్సిడెంట్‌కు గురై ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అత‌డు త‌న ప‌క్క‌నే ఉన్న‌ నర్సును పిలిచి తనకు కనీసం ఒక్క బీరు చుక్కయినా ఇప్పించమని అడిగాడు.
ఆమె అంగీకరించకపోవడంతో అర్ధరాత్రి తర్వాత తనకు తగిలించిన ట్యూబులు, మాస్కులు పీకేసి.. నగ్నంగా ఉన్న తన ఒంటిపై దుప్పటి కప్పుకుని ఐసీయూ నుంచి నడి రోడ్డు మీదకు వచ్చేశాడు. బయట మైనస్‌ 16 డిగ్రీల వాతావరణంతో గడ్డ కట్టుకుపోతున్నా లెక్కచేయకుండా బార్‌కు వెళ్లిపోయాడు. అక్కడ అతని వాలకం చూసిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే వచ్చిన పోలీసులు అతణ్ని హాస్పిటల్‌కు తరలించారు. అంతమంది సిబ్బంది, సెక్యూరిటీ నుంచి ఇతను కుంటుకుంటూ ఎలా బయటపడ్డాడన్నది హాస్పిటల్‌ యాజమాన్యానికి, పోలీసులకు అంతచిక్కడం లేదు. బీరు కోసం ప్రాణాల‌నే లెక్క‌చేయ‌ని వాడికి సిబ్బంది నుంచి త‌ప్పించుకు రావ‌డం ఓ లెక్కా అనుకోవాల్సిందే.

No comments:

Post a Comment