Monday 1 February 2016

సర్వే: గడ్డం పెంచడం వల్ల ఆ వ్యాధులు రావంట!

dfsdfsfsdfd

స‌హ‌జంగా ఎవ‌రైనా గ‌డ్డం పెంచారంటే ‘ల‌వ్ ఫెయిల్యూర్’ అనో, లేద ఏదో పోగొట్టుకున్నార‌నో ఫీలింగ్ క‌ల‌గ‌డం స‌హ‌జం. నిరాశ‌, నిస్పృహ‌ల‌కు లోనైన వారు గ‌డ్డం పెంచుకుంటార‌నే అపోహ ఎక్కువ మందిలో ఉంది. గ‌డ్డం పెంచితే తెలిసిన వారంద‌రూ ఆట‌ప‌ట్టించ‌డం మ‌నం చూస్తుంటాము. అయితే అటువంటి వాద‌న‌ల‌కు భిన్నంగా నున్న‌గా గ‌డ్డం గీసుకునే వారికంటే.. బాగా గ‌డ్డం పెంచిన‌వారే మూడు రెట్లు ఆరోగ్య‌వంతులుగా ఉంటార‌ని అమెరికా ప‌రిశోధకులు వెల్ల‌డించారు. గ‌డ్డం పెంచుకున్న వారికి అంటు వ్యాధులు అస‌లు ద‌రిచేర‌వ‌ని, బ్యాక్టీరియా వారి బుగ్గ‌ల‌కు చేర‌ద‌ని “బోస్ట‌న్‌లోని బ్రిగ్హ‌మ్ అండ్ ఉమెన్ హాస్పిట‌ల్ ప‌రిశోధ‌కులు” త‌మ అధ్య‌య‌నంలో గుర్తించారు.
గ‌డ్డం ఉన్న వారు, లేనివారితో చేసిన ప‌రిశోధ‌న‌లో తేలిందేమిటంటే.. ? శ్వాస‌, చ‌ర్మ సంబంధిత వ్యాధుల‌కు కార‌ణ‌మ‌య్యే “స్టాఫీలోకోక్క‌స్ ఆరేయ‌స్” అనే బ్యాక్టీరియా నీటుగా గ‌డ్డం గీసుకునే వారి ముఖాల‌పై పేరుకుపోతుంద‌ని ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. నీటుగా గ‌డ్డం చేసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం రాపిడికి గురై.. ముఖంపై గాట్లు ప‌డ‌తాయ‌ని, దీంతో ఆ గాయాల వ‌ల్ల బాక్టీరియా దేహంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం పూర్తిగా ఉంద‌ని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు. అదే గ‌డ్డం ఉన్న వారిలో ఆ బ్యాక్టీరియా చ‌ర్మంలోనికి ప్ర‌వేశించే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. సో.. గ‌డ్డం పెంచ‌డం మంచిదే అని మ‌రువకండి.

No comments:

Post a Comment