Friday 5 February 2016

క్యాన్సర్ కోరల్లో ఇండియా ..!

8040512010

ఆధునిక కాలంలో క్యాన్సర్ కి చాలా రకాల శస్త్ర చికిత్సలు వచ్చాయి.. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే..! మరణానికి చేరువైనట్టుగానే పరిగణించేవారు. క్యాన్సర్ కారకాలు అనేకం ఉన్నప్పటికీ.. వాయు కాలుష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తాజాగా అంత‌ర్జాతీయ క్యాన్స‌ర్ దినం సంద‌ర్భంగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలియ‌జేసిన వివ‌రాల ప్ర‌కారం ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రంగా తయారైందని.. ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య కోరల్లో చిక్కుకున్న టాప్-20 నగరాల్లో ఆగ్నేయాసియా పరిధిలోనే 14 నగరాలు ఉన్నాయని తెలియజేసింది . క్యాన్సర్ తో ప్రపంచవ్యాప్తంగా ఏటా 8.2 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నట్టు.. ఇందులో మూడింట రెండో వంతు మరణాలు ఎక్కువగా మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే సంభవిస్తున్నట్టుగా ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
క్యాన్సర్ మరణాల్లో 22 శాతం మరణాలు పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులతోనే నమోదవుతున్నట్టు పేర్కొన్న ఆరోగ్య సంస్థ.. ఆగ్నేయాసియా పరిధిలో భారత్‌ తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఈ జాబితాలో ఉన్నట్టుగా తెలిపింది. దేశాన్ని పట్టి పీడుస్తున్న క్యాన్సర్.. ఏటా 3.5 లక్షల మందిని బలి తీసుకుంటోంది. హృదయ సంబంధిత సమస్యల తర్వాత ఆ స్థాయిలో ఎక్కువమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యగా క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. దాదాపు 7 లక్షల క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదవుతుండడంతో.. వచ్చే 10-15 ఏళ్లలో దేశంలో క్యాన్సర్ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, క్యాన్సర్ ని నిర్మూలించే విధంగా తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించేలా కొత్త విధానాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ రీసెర్చ్ ప్రకటించింది.

No comments:

Post a Comment