Monday, 4 January 2016

బెజ‌వాడ‌లో రెచ్చిపోతున్న సీరియ‌ల్ కిల్ల‌ర్స్‌

088444050201

బెజ‌వాడో సీరియ‌ల్ కిల్ల‌ర్స్ రెచ్చిపోతున్నారు… స్కెచ్ వేస్తే ఇక మిస్ అవ‌డ‌మ‌నేదే లేకుండా.. పోలీసుల‌కు చిక్క‌కుండా ఉండేందుకు స‌రికొత్త టెక్నిక్‌లు ఫాలో అవుతూ త‌మ ప్ర‌తాపం చూపిస్తున్నారు.. నిన్న ఓ మహిళను కిరాతకంగా హత్యచేసిన దుండగులు..ఇవాళ దంపతులను దారుణంగా చంపేశారు. వరుస హత్యలు ఇప్పుడు బెజ‌వాడ‌లో సంచలనం రేపుతున్నాయి. జనం భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజుల వ్యవదిలో రెండు సంఘటనలు జరగడంతో పోలీసులకు కేసుల దర్యాప్తు సవాల్ గా మారింది. పడమటలోని చాపల మార్కేట్‌ దగ్గర జరిగిన హత్య స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ హ‌త్యకు కార‌ణం కుటుంబ కలహాలా..? దోపిడి దొంగ‌ల పనా అని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.
విజయవాడ..పటమటలోని చేపల మార్కేట్‌ దగ్గర దంప‌తుల‌ను దుండ‌గులు దారుణంగా చంపేశారు. పక్కా ప్రణాళికతో ఇంట్లోకి చొరబడి.. వీరాంజమ్మ, గంగాధర్‌లను హత్య చేశారు. వీరాంజమ్మ, గంగాధర్‌లకు ఒక్కరే కూతురు. ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. తల్లిదండ్రులను చూసేందుకు విజయవాడకు వచ్చిన ఆమె.. నిన్న హైదరాబాద్‌కు వెళ్లింది. గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి.. వీరాంజ‌మ్మ దంపతులను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో కారం చల్లి ఉండడంతో పోలీసుల దర్యాప్తున‌కు ఇబ్బంది ఏర్పడింది. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ దొంగలే ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. దీంతో వారి కోసం కంటి మీద కునుకు లేకుండా వారి కోసం గాలిస్తున్నారు.. వ‌రుస‌గా జ‌రుగుతున్న హ‌త్య‌ల‌తో విజ‌య‌వాడ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఎప్పుడు ఎవ‌రు ఎలా వచ్చి దాడి చేస్తారో తెలియ‌క బిక్కు బిక్కుమంటూ గ‌డుపుతున్నారు.
please share it..

No comments:

Post a Comment