Sunday 3 January 2016

మేయ‌ర్ అభ్య‌ర్థిగా అజారుద్దీన్‌..!

azaruddin-282902

తెలంగాణ‌లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న అధికార తెరాస ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఓడిపోతే తెలంగాణ‌లో తెరాస ప‌నైపోయింద‌ని ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌చారం చేస్తాయి. దీంతో కీల‌క‌మైన హైద‌రాబాద్ న‌గ‌రంపై ప‌ట్టు కోల్పోతే అది తెరాస‌కు కూడా పెద్ద ఎదురు దెబ్బే. అయితే న‌ల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస‌కు బిగ్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్ గ్రేట‌ర్ పీఠాన్ని కూడా ద‌క్కించుకుని తెరాస‌కు మ‌రో షాక్ ఇవ్వాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.
గ్రేట‌ర్ మేయ‌ర్‌గా కాంగ్రెస్ త‌ర‌పున భార‌త క్రికెట్ మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజాహారుద్దీన్‌ను పేరును తెర‌పైకి తెస్తోంది. ఉంటే గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరనేది ముందుగానే ప్రకటిస్తామని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. మేయర్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న దానం నాగేంద‌ర్ తెరాస‌లో భేర‌సారాలు ఆడి అక్క‌డ లెక్క‌లు కుద‌ర‌క‌పోవ‌డంతో కాంగ్రెస్‌లో కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు టీ పీసీసీ పెద్ద‌లు కాంగ్రెస్ అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో దానంను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు.
హైదరాబాద్‌కు చెందిన అజహర్‌కు సెలబ్రిటీ హోదాతో పాటు నగర యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంఐఎం దూరం కావటం, అధికార టీఆర్‌ఎస్ పలు కార్యక్రమాలతో దూకుడు పెంచడంతో అజ‌ర్ పేరును మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే అటు ఎంఐఎంతో పాటు ఇటు తెరాస‌కు కూడా చెక్‌పెట్టిన‌ట్ల‌వుతుంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌ను టీ కాంగ్రెస్ పెద్ద‌లు అజర్ ముందు ఉంచితే కాస్త టైం తీసుకుని త‌న నిర్ణ‌యాన్ని చెపుతాన‌ని అజ‌ర్ కాంగ్రెస్ పెద్ద‌ల‌తో అన్న‌ట్టు టాక్‌. ఏదేమైనా అజ్జూ పేరు తెర‌మీద‌కు తెస్తున్న కాంగ్రెస్ దానంకు మాత్రం ఓ రేంజ్‌లో షాకిచ్చేలా క‌నిపిస్తోంది. అయితే అజ‌ర్ ఇటీవ‌ల బీజేపీలో చేర‌తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ టైంలో ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా అన్న‌ది పెద్ద స‌స్పెన్స్‌గా ఉంది.
please share it..

No comments:

Post a Comment