Sunday 3 January 2016

అల్లుఅర్జున్ సేఫ్ గేమ్

045600020320

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు అందరూ ఓ వైపు హీరోలుగానే చేస్తూ, మరోవైపు బిజినెస్ వ్యవహారాలను చూస్తున్నారు. ఇక హీరోగా అలరించిన అల్లు అర్జున్, తాజాగా నిర్మాత అవతారం ఎత్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్లానింగ్స్ జరుగుతున్నాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘భలేభలే మగాడి వోయ్’ సినిమాను కన్నడలో రీమేక్ చేయడంతో, నిర్మాతగా తన కెరియర్ ను మొదలుపెట్టాలని రెడీ అయ్యాడు. తెలుగు, మలయాళ ప్రేక్షకులలో తనకంటూ ఒక క్రేజ్ ని తెచ్చుకున్న అల్లు అర్జున్, ఇక తమిళ ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రెడీ అవుతున్నాడు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా కన్నడ రైట్స్ ను రాక్ లైన్ వెంకటేష్ సొంతం చేసుకున్నాడు. ఆయనతో కలిసి ఈ సినిమాను కన్నడలో నిర్మించడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. కన్నడలో నిర్మించనున్న ఈ సినిమాకి నిర్మాతగా అల్లుఅరవింద్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నప్పటికీ, పైకి మాత్రం అల్లుఅర్జున్ పేరు వినిపించేలా అల్లుఅరవింద్ చూసుకుంటున్నాడు. ఇక ఈ మూవీ తరవాత అల్లుఅర్జున్ 2016లో రెండు చిన్న చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించనున్నాడంట.
please share it..

No comments:

Post a Comment