Friday 29 January 2016

తెలంగాణ‌కు అందుకే స్మార్ట్ సిటీ రాలేదా..!

59205602530

కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న `స్మార్ట్` సిటీల జాబితాను మంత్రి వెంక‌య్య నాయుడు ప్ర‌క‌టించారు. తొలిదశ‌లో ఎంపికైన నగరాల్లో ఏపీ డ‌బుల్ బొనాంజా ద‌క్కితే.. తెలంగాణ‌కు మాత్రం రిక్త‌హ‌స్త‌మే మిగిలింది. కాకినాడ‌, విశాఖ ఏపీ త‌ర‌ఫున మొద‌టి ద‌శ‌లో ఉన్నాయి. మ‌రి తెలంగాణలోని ఏ ఒక్క న‌గ‌ర‌మూ `స్మార్ట్‌` సిటీగా ప‌నికిరాద‌ని కేంద్రం భావించిందా? లేక తెలంగాణ ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్లుగానే కేంద్రం తెలంగాణ‌పై శీత‌క‌న్ను వేసిందా? లేక కేంద్రం నిధులు ఇస్తామ‌న్నా కేసీఆర్ పంతాల‌కు పోతున్నారా? ఇటువంటి సందేహాలు ఇప్పుడు ప్ర‌తిఒక్క‌రిలో మెదులుతున్నాయి.
తెలంగాణ‌కు స్మార్ట్ సిటీ ద‌క్క‌క‌పోవ‌డానికి కార‌ణం మ‌రెవ‌రో కాదు.. సీఎం కేసీఆర్ అని కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ ఆరోపించారు.
హైదరాబాద్ కు కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంద‌ని ద‌త్తాత్రేయ తెలిపారు. కానీ వాటిని కేసీఆర్ వ‌ద్దంటున్నార‌ని వివ‌రించారు. హైదరాబాద్ బదులు కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా ఇవ్వాలని కేసీఆర్ కోరారని ఆయన వెల్ల‌డించారు. హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో దత్తాత్రేయ పాల్గొని ఈ అంశాల‌ను వివ‌రించారు.
`స్మార్ట్` సిటీ గా హైదరాబాద్‌కు నిధులు ఇస్తామంటే వద్దన్న కేసీఆర్…తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హైదరాబాద్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమని విమ‌ర్శించారు. హైదదరాబాద్ స్మార్ట్ సిటీ అయి ఉంటే కోట్ల రూపాయల నిధులు వచ్చేవని దత్తాత్రేయ చెప్పారు. ఉపాధి అవకాశాలు వస్తాయని, ఇవేవి వద్దని కేసీఆర్ అనుకుంటున్నారా? అని ఆయన అన్నారు. ఒక‌వేళ ఇదంతా నిజ‌మే అయినా.. ప్ర‌జ‌ల‌కు ఇవన్నీ విమ‌ర్శ‌లుగానే మిగిలిపోతాయి. మ‌రి ఈ స్మార్ట్ సిటీల ఎంపిక తెలంగాణ ప్ర‌భుత్వానికీ, కేంద్రానికీ మ‌ధ్య గ్యాప్ ఉంద‌నే విష‌యం చెప్ప‌క‌నే చెబుతోంది.

No comments:

Post a Comment