Sunday 3 January 2016

డాక్యుమెంటరిగా రానున్న బాహుబలి

847850450120

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డ్స్ మోత మోగించిన మూవీ బాహుబలి. ఎన్నడూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కనీ వినీ ఎరగని విధంగా బాహుబలి మూవీని ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానంలో రాజమౌళి నిలుచోపెట్టాడు. దీంతో రాజమౌళి పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఎంతో ప్రత్యేకతం. ఇదిలా ఉంటే తాజాగా ‘బాహుబలి 2’ ఫస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇక షూటింగ్ షెడ్యూల్ తరువాత ఈ సినిమాని నెక్ట్స్ షెడ్యూల్ ని కేరళలో ప్లాన్ చేశారు. బాహుబలి2లోని ప్రధాన షెడ్యూల్స్ అన్నీ కేరళ, రామోజీ ఫిల్మ్ సిటీలోనూ జరగనున్నాయి. పక్కా ప్రీ ప్లాన్డ్ గా రాజమౌళి షెడ్యూల్స్ ని పూర్తి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాహుబలి2 షూటింగ్ జరుగుతున్న సమయంలో..బాహుబలి గురించిన ప్రత్యేకమైన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీని రాజమౌళి ఓ డాక్యుమెంటరీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడంట. బాహుబలి, బాహుబలి2 సినిమాలను మొత్తం కలిపి…పూర్తి కథ వచ్చే విధంగా ఓ డాక్యుమెంటరీ స్టైల్లో దీన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడంట. ఆ డాక్యుమెంటరీలో టెక్నికల్ గా మూవీ ఎలా విజయాన్ని సాధించింది….అలాగే కథలోని కీలక పాత్రల ప్రత్యేకత గురించి.. టెక్నికల్ టీం చెప్పే విలువైన సమాచారం గురించి ఇందులో పొందుపరచున్నారు. ఇక ఈ డాక్యుమెంటరీ నిడివి గంట ఇరవై నిముషాలు ఉంటుందని అంటున్నారు. దీంతో బాహుబలి డాక్యుమెంటరీ సైతం సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం బాహుబలి2 లీడ్ పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
please share it..

No comments:

Post a Comment