Wednesday 27 January 2016

స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్స్‌కి స‌రికొత్త వ్యాధి

9505605002

స్మార్ట్… స్మార్ట్ ….స్మార్ట్‌… ఐదేళ్ల పిల్ల‌ల నుంచి 60ఏళ్ల వృద్ధుల వ‌ర‌కూ అంతా `స్మార్ట్‌` మాయ‌లో ప‌డిపోతున్నారు. ఒక స‌ర్వే ప్ర‌కారం ప్ర‌తి ముగ్గురిలో ఇద్ద‌రి ద‌గ్గ‌ర స్మార్ట్ ఫోన్ ఉంద‌ట‌. అంతలా జ‌నాలు స్మార్ట్‌కి అల‌వాటుప‌డిపోయారు. ప్ర‌పంచం అంతా క్ష‌ణాల్లో చుట్టేయ‌డం.. నిత్యం ఫ్రెండ్స్‌తో కాల‌క్షేపం.. ఆన్‌లైన్ డేటింగ్‌లు.. చాటింగ్‌లు.. ఫేస్‌బుక్‌.. వాట్స‌ప్.. ఇలా ప్రపంచ‌మంతా అర‌చేతిలో ఇమిడిపోయే ఫోన్‌లో దొరుకుతుంటే ఇక వ‌ద్ద‌నే వారెవ‌రుంటారు! జనాలు ఏమున్నా.. లేకపోయినా పెద్దగా పట్టించుకోవటం లేదుగాని.. చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది లేకపోతే చిన్నతనంగా ఫీలైవుతున్నారు. దీనికి తోడు అనేక పెద్ద కంపెనీలు రూ. 10,000 ల లోపే అద్బుతమైన, అన్ని ఫీచర్లు కలిగిన ఫోన్లను అందుబాటులోకి తేవడం కూడా స్మార్ట్ ఫోన్ వినియోగానికి ఎక్కువ ఆస్కారం కలిగిస్తోంది.
ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉందంటున్నారు శాస్త్రవేత్త‌లు. ఎందుకంటే ఎక్కువ సేపు దీనిని వినియోగించ‌డంవ‌ల్ల అనేక వ్యాధుల బారిన ప‌డిపోతున్నార‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. ఇటీవ‌లే ఈ స్మార్ట్‌పోన్ వ‌ల్ల కొత్త వ్యాధి సోకే ప్ర‌మాద‌ముంద‌ని వెల్ల‌డించారు. అదే `స్మార్ట్‌ఫోన్ పింకీ`.
రోజులో 6 గంటలకన్నా ఎక్కువ సేపు స్మార్ట్ పై వేళ్ళు ఆడించేవారికి ఓ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అదే ‘ స్మార్ట్ ఫోన్ పింకీ’ అనే వ్యాధి. ఇటీవల స్మార్ట్ ఫోన్ యూజర్ల పై సర్వే జరిపిన ఆస్ట్రేలియాలోని కర్టిన్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. అదే పనిగా స్మార్ట్ ఫోన్లో చాటింగ్, బ్రౌసింగ్ చేయటం వల్ల కొన్నాళ్ళకు చేతి వేళ్ళు ఒంగిపోయి ఫోన్ వాడకుండానే కదులుతూ ఉంటాయట. ఒకవేళ వాటిని వంచడానికి ప్రయత్నించినా మళ్ళీ యథాస్థానికి వెళ్లి కదులుతూ ఉంటాయట. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ పింకీ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వాటి వాడకాన్ని కాస్త తగ్గించాలి మరి. సో స్మార్ట్ యూజ‌ర్స్ జాగ్ర‌త్త‌గా మీ స్మార్ట్‌ఫోన్‌ని వినియోగించండి. లేక‌పోతే మీ చేతి వేళ్లు మాత్రం ప్ర‌మాదంలో ప‌డిపోయే ముప్పు ఉంది.

No comments:

Post a Comment