Thursday 28 January 2016

చిరు 150వ సినిమాకు కొత్త క‌ష్టాలు

tt08450120

మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకు కొత్త అడ్డంకులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా రీ ఎంట్రీ సినిమాపై కసరత్తులు చేస్తున్న చిరంజీవి, ఇటీవలే తమిళ సూపర్ హిట్ సినిమా ‘కత్తి’ని రీమేక్ చేయాలని నిర్ణయించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో చిరు త‌న‌యుడు చెర్రీ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై, క‌త్తి చిత్రం త‌మిళ్ వెర్ష‌న్ నిర్మించిన లైకా సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాల‌నుకున్నాయి. మార్చిలో ఈ చిత్రం ప్రారంభం కానుందంటూ ఇటీవ‌ల వార్త‌లు కూడా జోరుగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో చిరు క‌త్తి రీమేక్ చేసే హ‌క్కు లేదంటూ ఓ స‌రికొత్త వివాదం తెర మీద‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.
త‌మిళంలో క‌థ అందిస్తూ కత్తి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ముర‌గ‌దాస్‌. అక్క‌డ సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్ర క‌థ నాదంటూ ర‌చ‌యిత ఎన్.న‌ర‌సింహారావు ఓ స‌రికొత్త కాంట్ర‌వ‌ర్సీ కి తెర తీశాడు. కానీ ఇన్ని రోజులు దీన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తుండ‌టంతో క‌థా హ‌క్కుల వేదిక చైర్మ‌న్ దాస‌రి నారాయ‌ణరావుకి- న‌ర‌సింహారావు ఫిర్యాదు చేయ‌డంతో క‌థా హ‌క్కుల సంఘం వారు రంగంలోకి దిగినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. క‌త్తి చిత్రానికి సంబంధించిన క‌థ న‌ర‌సింహారావుది అంటూన్నాడు కాబ‌ట్టి…ఆ విష‌యం ఒక కొలిక్కి వ‌చ్చాకే క‌త్తి సినిమా రీమేక్ ప్రారంభించాలంటూ క‌థ హ‌క్కుల సంఘం చైర్మ‌న్ దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌తిపాదించారు.
తాము చెప్పిన‌ట్టు చేయ‌ని ప‌క్షంలో క‌త్తి సినిమాకు ద‌ర్శ‌కుల సంఘం, సీనీ కార్మికుల ఫెడ‌రేష‌న్ వారు స‌హాయ స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నార‌ట‌. అయితే ఈ సినిమాను త‌మిళంలో నిర్మించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు తెలుగులో కూడా భాగ‌స్వాములుగా ఉన్నారు కాబ‌ట్టి, దీనికి సంబంధించిన‌దంతా వారే చూసుకుంటారులే అన్న ధీమాతో త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నార‌ట చిత్ర టీమ్‌. చివ‌రికి ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. అలాగే ఇండ‌స్ర్టీలో చిరు 150వ సినిమాకు దాస‌రి బ్రేక్ వేశార‌న్న టాక్ కూడా విన‌వ‌స్తోంది.

No comments:

Post a Comment