Thursday 31 December 2015

సరైనోడు ఫస్ట్ లుక్ లీక్డ్ డిటైల్స్

45045450140

మెగాహీరో అల్లుఅర్జున్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం సరైనోడు. సంక్రాంతికి ‘సరైనోడు’ ఫస్ట్ లుక్’ను రిలీజ్ చేయాలని గత కొంత కాలంగా చిత్ర యూనిట్ లో చర్ఛలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు చేస్తున్న చిత్ర యూనిట్ ఫైనల్ గా సంక్రాంతి రోజున సరైనోడు మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘సరైనోడు’ సినిమా, పక్కా మాస్ కమర్షియల్ కథాంశంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో అల్లుఅర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ అలాగే కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ మూవీ, ఇప్పటి వరకూ ఎటువంటి ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేయకపోవటం విశేషం. దీంతో సంక్రాంతి పండుగకి అభిమానులను సంతోషపెట్టడం కోసం, సరైనోడు మూవీకి సంబంధివచిన ఫస్ట్ లుక్ బయటకు రానుంది. అయితే చిత్రయూనిట్ లో ఈ ఫస్ట్ లుక్ కి సంబంధించిన కొన్ని చర్చలు జరుగుతున్నాయి. దాని ప్రకారం, రాబోయే ఫస్ట్ లుక్ లో అల్లుఅర్జున్ పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే 3 రకాల డిజైన్స్ ని ఫైనల్ చేశారు. వాటిలో అల్లుఅర్జున్ నిర్ణయం మేరకు ఏ పోస్టర్ ని ఫైనల్ చేస్తే..ఆ పోస్టర్ ఫస్ట్ లుక్ గామారనుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది.

please share it..

No comments:

Post a Comment