Showing posts with label foods. Show all posts
Showing posts with label foods. Show all posts

Wednesday, 27 January 2016

క్లిక్ కొట్టు.. బిర్యానీ ప‌ట్టు

048058450420

రిమ్ రిమ్ హైద్రాబాద్ రిక్షావాలా జిందాబాద్ ..
భాగ్య‌న‌గ‌రికి జిందాబాద్ కొట్ట‌ని వారెవ‌ర‌ని..?
భాగ్య‌న‌గ‌రి అంటే మురిసిపోని వారెవ‌ర‌ని..?
అంత‌గా మ‌న జీవితాల్లో పెన‌వేసుకుపోయిందీ న‌గ‌రి.
ఇక్క‌డే ఆనందం.. ఇక్క‌డో విషాదం వెర‌సి ఇదే మ‌న సుంద‌ర ధామం.
హైద్రాబాద్ అంటే గుర్తొచ్చే ఇరానీ చాయ్‌, బిర్యానీ, ఇంకా ఏవేవో ఎన్నెన్నో క‌దూ!
అందుకే ఇప్పుడు ప్ర‌ముఖ ఆన్ లైన్ సంస్థ‌ ఫుడ్‌పాండా.. మ‌న ప్యార‌డైజ్ తో ఒప్పందానికి వ‌చ్చింది.
దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫుడ్‌పాండా ప్రముఖ బిర్యానీ హౌస్‌ ప్యారడైజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త‌మ సంస్థ సాయంతో వినియోగ‌దారులు ఆన్‌లైన్ విధానం ద్వారా బిర్యానీని ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపిందీ సంస్థ‌. ఇక ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్‌తో బిర్యానీ పొందేయండిక ! బిర్యానీ ఆన్‌లైన్‌లోకి వ‌చ్చేసింది ఇక చార్మిన‌ర్ గాజులు కూడా వ‌చ్చేస్తాయంటారా!