Thursday, 4 February 2016

ప్రభాస్‌కి బాలీవుడ్ బంపర్ ఆఫర్

324567890-

బాహుబ‌లితో ప్ర‌భాస్ జాత‌కం మారింద‌ని తెలుసు. కానీ మ‌రీ ఇంత‌లా ట‌ర్న్ అవుతుంద‌నీ ఆయ‌న కూడా ఊహించి ఉండ‌డు. బాహుబ‌లి సినిమాతో వ‌చ్చిన క్రేజ్‌తో ప్ర‌భాస్ పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి 2 త‌ర్వాత బాలీవుడ్ సినిమాల వైపు ప్ర‌భాస్ దృష్టి పెడ‌తాడ‌నే వార్త‌లొస్తున్నాయి. బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో బాగానే పరిచయాలు పెంచుకున్నాడు ప్రభాస్. ఆ పరిచయాలతో ఇప్పుడో అద్భుతమైన ఆఫర్ అందిపుచ్చుకోబోతున్నాడు.
హిందీలో సూపర్ హిట్ సిరీస్ గా పేరుతెచ్చుకున్న ధూమ్ సిరీస్ లో ప్రభాస్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో చిన్న విలన్‌గా నటించమంటూ ప్రభాస్ కు ఆఫర్ వచ్చింది. నిజానికి ధూమ్ సిరీస్ లో విలన్ కే ప్రాధాన్యం ఎక్కువ. మొదట జాన్ అబ్రహాం విలన్ గా చేశాడు. తర్వాత హృతిక్ రోషన్ విలన్ అయ్యాడు. ఈమధ్యే ధూమ్-3లో అమీర్ ఖాన్ కూడా విలన్ గా నటించాడు. ఇప్పుడు ధూమ్-4లో ప్రభాస్ కు అలా విలన్ గా నటించే ఆఫర్ వచ్చింది. అయితే మెయిన్ విలన్ గా హృతిక్ రోషన్ ఉంటాడు. ఓ ఛోటా విలన్ గా ప్రభాస్ కనిపిస్తాడన్నమాట. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్…. ఈ ఆఫర్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.

No comments:

Post a Comment