Friday 5 February 2016

రివ్యూ:స్పీడున్నోడు

23456

సినిమా: స్పీడున్నోడు
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సోనారిక బ‌డోరియా, త‌మ‌న్నా(స్పెష‌ల్ సాంగ్‌), ప్ర‌కాష్‌రాజ్‌, రావూ ర‌మేష్‌, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ర్టీ పృథ్వి, శ్రీనివాస్‌రెడ్డి త‌దిత‌రులు
స‌మ‌ర్ప‌ణ‌: భీమినేని రోషిత సాయి
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్‌
సంగీతం: డీజే.వ‌సంత్‌
ఎడిటింగ్‌: గౌతంరాజు
నిర్మాత‌: భీమినేని సునీత‌
ద‌ర్శ‌క‌త్వం: భీమినేని శ్రీనివాస‌రావు
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 05 ఫిబ్ర‌వ‌రి, 2016
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్‌లో ఏ హీరో లాంచ్ అవ్వ‌ని రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. రూ.40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఆ సినిమా హిట్ అయినా స్టార్ కాస్టింగ్ ఎక్కువ అవ్వ‌డంతో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా బెల్ల‌కొండ‌కు నిరాశ‌నే మిగిల్చింది. అల్లుడు శీనుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనివాస్ రెండవ సారి ‘స్పీడున్నోడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు దూసుకు వస్తున్నాడు. రీమేక్‌ల స్పెష‌లిస్టుగా పేరున్న భీమినేని శ్రీనివాస‌రావు స్వీయ నిర్మాణ‌, ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 800 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. కోలీవుడ్‌లో హిట్ అయిన సుంద‌ర్ పాండ్య‌న్ సినిమాకు రీమేక్‌గా స్పీడున్నోడు తెర‌కెక్కింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మ‌న ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో ఓ లుక్కేద్దాం.
స్టోరీ:
రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా రాప్తాడు విలేజ్‌కు వీర‌భ‌ద్ర‌ప్ప (ప్ర‌కాష్‌రాజ్‌) పెద్ద‌గా ఉంటాడు. అత‌ని కొడుకే మ‌న హీరో శోభ‌న్‌బాబు (బెల్లంకొండ శ్రీనివాస్‌). డిగ్రీ పూర్త‌య్యి నాలుగు సంవ‌త్స‌రాలు అవుతున్నా ఎలాంటి ప‌నీ పాటా లేకుండా స్నేహితుల‌తో క‌లిసి అల్ల‌రి వేషాలు వేస్తుంటాడు. అమ్మాయిల‌ను లైన్లో పెట్ట‌డంలో మ‌నోడిది అందెవేసిన చేయి. ఫ్రెండ్స్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసే మ‌న‌స్త‌త్వం ఉన్న వాడు.
కాలేజీ రోజుల్లోనే పక్కనే వున్న వెంకటాపురం గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న అమ్మాయి వాసంతి(సొనారిక)కి లవ్ ప్రపోజ్ చేసి భంగపడతాడు. ఆ స్టోరీని అంతటితో మర్చిపోయి ఊర్లో వాళ్లందరి లవ్ స్టోరీలు గెలిపించ‌డానికి సాయం చేస్తుంటాడు. ఓ రోజు గిరి అనే స్నేహితుడి లవ్‌ని సెట్ చేయడానికి పక్క ఊరికి వెళ్లగా అక్కడ మళ్లీ తన మాజీ లవర్ కనిపిస్తుంది. స్నేహితుడికి సహాయం చేయడానికి ఏమైనా చేయడానికి వెనుకాడని శోభన్ అతడి ప్రేమ‌ను గెలిపించాడా ? ఇంతకీ అక్కడ శోభన్ మాజీ లవర్ ఎందుకుంది ? తన స్నేహితుడు ప్రేమించింది కూడా ఆమెనేనా లేక మరొకరా ? ఒకవేళ ఆమె అయితే అప్పుడు శోభన్ ఏం చేస్తాడు ? ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ‌లో వాసంతి తండ్రి రామచంద్రప్ప (రావు రమేష్), జగన్ (కబీర్ దుహాన్ సింగ్)ల పాత్ర ఏమిటి..? ఫ్యాక్షన్ హత్యలతో, చావుకి చావే సమాధానంగా వున్న ఆ రెండు గ్రామాలకి చెందిన శోభన్, వాసంతిల మధ్య లవ్ స్టోరీ ఎలా సుఖాంతం అయ్యిందనేదే మిగతా కథనం.
విశ్లేష‌ణ‌:
అల్లుడు శీను సినిమాతో హీరోగా మంచి మార్కులేయించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా ప‌రిణితితో కూడిన న‌ట‌న క‌న‌ప‌రిచాడు. పాటల్లో సూప‌ర్బ్ డ్యాన్స్ చేయ‌డంతో పాటు యాక్ష‌న్ సీన్ల‌లో న‌టుడిగా తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరోయిన్ సోనారికా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుంది..యూత్‌ను బాగా ఆకర్షిస్తుంది. శీను-సోనారిక మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్ల‌లో ఆమె చాలా క్యూట్‌గా ఉంది. ఇక హాట్ బ్యూటీ తమన్నా ‘బ్యాచ్ లర్ బాబూ’ పాటలో డ్యాన్స్‌లో అద‌ర‌గొట్టేసింది. ఈ పాటలో శ్రీనివాస్ అద్భుతమైన డ్యాన్స్ చాలా ఎనర్జిటిక్‌గా చేశాడు. మిగిలిన వాళ్ల‌లో ప్ర‌కాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్ర‌కాష్‌రాజ్‌, రావు ర‌మేష్ మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్లు బాగున్నాయి. మిగిలిన వారిలో పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ పండించారు. కృష్ణచైతన్య, కబీర్ విలన్స్ గా ఆకట్టుకున్నారు. రమాప్రభ, శ్యామల, ఝాన్సీ, విద్యుల్లేఖ లాంటి చాలా మంది ఆర్టిస్ట్ లు ఉన్నా ఎవరికి గుర్తింపు వచ్చే స్థాయి పాత్రలు దక్కలేదు.
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
స్పీడున్నోడు మూవీని సాంకేతికంగా చూస్తే విజ‌య్ సినిమాటోగ్ర‌ఫీ గుడ్‌. ప్ర‌తి ఫ్రేము చాలా రిచ్‌గా తెర‌పై క‌న‌ప‌డేందుకు అత‌డు చేసిన వ‌ర్క్ స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇక డీజే వ‌సంత్ నేప‌థ్య సంగీతం చాలా సీన్ల‌లో బాగా ఎలివేట్ అయ్యింది. సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు ఎడిటింగ్ చాలా చోట్ల డ్రాగ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు నిర్మాత కం డైరెక్ట‌ర్ అయిన భీమినేని శ్రీనివాస‌రావు విష‌యానికి వ‌స్తే నిర్మాత‌గా ఎక్కడా రాజీ ప‌డ‌కుండా సినిమాను తెర‌కెక్కించాడు.
భీమినేని డైరెక్ష‌న్ క‌ట్స్‌:
ఇక డైరెక్ష‌న్ విష‌యానికి వ‌స్తే రీమేక్‌ల స్పెష‌లిస్టుగా అత‌డికి ఉన్న పేరును మ‌రోసారి నిల‌బెట్టుకున్నాడు. సుంద‌ర్‌పాండ్య‌న్ సినిమాను తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్చ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. సినిమా క‌థ‌నం విష‌యంలో కొత్త‌ద‌నం లేక‌పోయినా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో అల‌రించ‌డానికి ట్రై చేశాడు. ఇక న‌టీన‌టుల నుంచి మంచి పెర్పామెన్స్ రాబ‌ట్టుకోవ‌డంలో మాత్రం బాగానే స‌క్సెస్ అయ్యాడు. సినిమా ఫ‌స్టాఫ్‌లో క‌థ‌నం సోసోగా ముందుకు క‌దిలిన అస‌లైన భీమినేని మార్క్ కామెడీ, ఫ్యామిలీ స్టోరీ మార్క్ సెకండాఫ్‌లో క‌న‌ప‌డుతుంది. రేసీ సాంగ్స్, కమెర్షియల్ ఎలిమెంట్స్, రిచ్ మేకింగ్‌తోపాటు అక్కడక్కడా పేలిన కామెడీ డైలాగులు సినిమాని ముందుకు తీసుకెళ్లాయి. ఓవ‌రాల్‌గా సినిమాకు సెకండాఫ్ హైలెట్‌. ఓవ‌రాల్‌గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు స్లో నెరేష‌న్‌లో వెళ్ల‌డం ప్రేక్ష‌కులకు కాస్తంత విసుగు తెప్పిస్తుంది.
ప్లస్ పాయింట్స్
మెయిన్ స్టోరి
క్లైమాక్స్
ప్రొడక్షన్ వాల్యూస్
తమన్నా స్పెషల్ సాంగ్
హీరో హీరోయిన్ కెమిస్ర్టీ
సెకండాఫ్‌
నిర్మాణ విలువ‌లు
మైనస్ పాయింట్స్
స్లో నేరేషన్
ఎడిటింగ్
పాటలు
ఫ‌స్టాఫ్‌
భీమినేని మ్యాజిక్ మిస్‌
ఫైన‌ల్‌గా…
ఓవ‌రాల్‌గా స్పీడున్నోడు ఓహో అనిపించ‌క‌పోయినా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఓ సారి చూసేయొచ్చు. అయితే భీమినేని మార్క్ కామెడీ మూవీగా మాత్రం స్పీడున్నోడు మిగిలిపోతుంది. ఇక స్పీడున్నోడుతో కేరీర్ ప‌రంగా స్పీడు చూపిస్తాడ‌నుకున్న శీను కాస్త స్లో అయ్యాడు. ఫ్రెండ్స్‌లో చెడ్డవాళ్లు వుండవచ్చేమో కానీ ఫ్రెండ్‌షిప్ ఎప్పుడూ చెడ్డది కాదనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘స్పీడున్నోడు’ మొత్తానికి పర్లేదనిపించాడు. అయితే శ్రీను టాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా నిల‌దొక్కుకునేందు మ‌రో సినిమా కోసం వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.
స్పీడున్నోడు మూవీ డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 2.75

No comments:

Post a Comment