Monday 8 February 2016

పవన్ కి కాపు వర్గం గట్టి షాక్ !

4080450102104

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ కి కాపు వర్గం గట్టి షాకింగ్ ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం తునిలో కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మహా గర్జన ఉద్రిక్తంగా మారిందనే విషయం తెలిసిదే. ఇందులో ఓ రైలునే తగలబెట్టారు ఆంధోళనకారులు. ఈ సంఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ఓ ప్రత్యేక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు అనేదానిపై క్లారిటీ లేకుండా మాట్లాడాడు. మొత్తంగా రైలు తగలబెట్టడం అసాంఘీక శక్తుల చర్య అయి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తను ప్రత్యేకంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదని అనటంతో…కాపు వర్గం మండిపడింది. పవన్ కళ్యాన్ కాపు వర్గానికి మద్దతు ఇవ్వకుండా…తను కాపు వర్గానికి సపోర్ట్ చేయను అన్నట్టుగా మాట్లాడటం ఇక్కడ కాపు వర్గానికి నచ్ఛలేదంట. దీంతో కాపు వర్గం నుండి పవన్ కళ్యాన్ పై నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కాపు ఐఖ్యత కోసం జరుగుతున్న పోరాటంలో కొంత మంది పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మని దగ్ధం చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే కాపులను గుర్తించాలంటూ తను ట్విట్టర్ నుండి మద్దతు ప్రకటించాడు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని, అధికార పార్టీ కూడా ఈ డిమాండ్‌కు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తుచేశాడు. కాపుల డిమాండ్‌ను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీని పవన్ కోరారు. అయితే కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ నుండి బయటకు వచ్చి, ప్రజల మధ్యలో ఉండి పోరాడాలని అంటున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పంధిస్తాడో అనేది చూడాలి మరి.

No comments:

Post a Comment