Thursday, 4 February 2016

తమ్ముడి రాజకీయంపై చిరు కామెంట్

pawan-kalyan-chiru-44

జ‌న‌సేనాని ప‌వ‌న్ రాజ‌కీయ య‌వ‌నిక‌(పొలిటిక‌ల్ డ‌యాస్‌)పై దూసుకుపోతున్నారు. స‌మాకాలీన అంశాల‌పై ప్ర‌తిస్పందిస్తూ.. ట్విట్లు చేస్తూ.. అభిమానులనే కాదు సామాన్యుల‌నూ ఆలోచింప‌జేస్తున్నారు. అంతేకాదు వీలున్నంత వ‌ర‌కూ సినీ మాధ్య‌మాన్నీ.. పాట సాహిత్యాన్నీ త‌న భావజాల వ్యాప్తికి వాడుకుంటున్నారు. కానీ చిరు అలా కాదు. త‌న ప‌నేదో త‌న‌ది. మెగాస్టార్‌గా ఆయ‌న అంద‌రి మ‌న్న‌న‌లు చూర‌గొన్నా.. ఫుల్ం పొలిటీష‌న్‌గా అంద‌రివాడు అనిపించుకోలేక‌పోయారు. పీఆర్పీని స్థాపించి, కాంగ్రెస్‌లో విలీనం చేసి కొంత విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ్ముడు రాజకీయ ప్రస్థానంపై చిరంజీవి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. పవన్, తాను విభిన్న రాజకీయ దారుల్లో వెళ్తున్నామని అన్నారు. ప్ర‌స్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా అది త‌న సొంత పార్టీ కాద‌ని, అక్క‌డ తాను చెప్పినట్లు జరగదని చెబుతూ ఆస‌క్తిదాయ‌క చ‌ర్చ‌కు తెర‌లేపారు. పవన్, మీరు.. ఒక రాజకీయ వేదికపైకి వస్తే బావుంటుంది కదా.. అన్న ప్రశ్నకు అలాంటి పరిణామం జరుగుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని నిర్వేదం వ్యక్తం చేశారు. సో.. ఫైనల్ గా పవన్, చిరు పొలిటికల్ గా మాత్రం కలవరు. రేప‌టి వేళ‌.. జ‌న్మ‌దిన వేడుక‌ల్లోనైనా క‌లుస్తారా.. అభిమానుల‌ను అల‌రిస్తారా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. స‌మాధానం కోసం శ‌నివారం ఉద‌యం దాకా వేచి చూడండి. స్టే ట్యూన్ టు మెగా కాంపౌండ్‌.

No comments:

Post a Comment