Wednesday 17 February 2016

ఎన్టీఆర్ డైలాగుల‌పై ఇండియ‌న్ రైల్వే క‌న్ను

804850150120

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన ‘రాఖీ’ సినిమా గుర్తుందా…2007లో వ‌చ్చిన అప్పట్లో చెల్లెమ్మల మనసు  దోచింది. అయితే ఈ సినిమాలో రైల్వే వాళ్ల గురించి ఎన్టీఆర్ చెప్పిన ఓ లాంగ్ డైలాగ్ మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌ట‌కీ గుర్తుండి పోతుంది. రైల్వే స్టేష‌న్‌లో షాయాజీ షిండే భారతీయ రైల్వేని కించపరుస్తూ మాట్లాడ‌తాడు. దీంతో ఎన్టీఆర్ షాయాజీ షిండేకు చాలా ఘాటుగా కౌంటర్ ఇస్తాడు.
షాయాజీ షిండే ఆప్ర్టాల్ రైల్వే కూలీ అంటే రైల్వే అంటే ఆప్ర్టాల్ కాదు అని ఎన్టీఆర్ అదిరిపోయే రేంజ్‌లో డైలాగ్ చెప్పాడు. దాంతో ఆ డైలాగ్స్ నే ఇప్పుడు రైల్వే డిపార్ట్ మెంట్ మెచ్చి వాటిని ఉపయోగించుకోనుందని తెలుస్తోంది. ఈ డైలాగ్ ను రైల్వే శాఖ ఇప్పుడు తమ ప్రచారంలో భాగంగా ఉపయోగించుకోవాలని భావిస్తోందట.
సేలం రైల్వేస్ లో ఓ అధికారి ఈ డైలాగ్ ని షేర్ చేసుకోగా..రైల్వే శాఖ మళ్ళీ దాన్ని ట్వీట్ చేసిందని తెలుస్తోంది. తమ సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఈ శాఖ ప్రతి రైల్వే స్టేషన్ లోనూ టీవీల ద్వారా దీన్ని వినియోగించుకుని తమ ప్రతిష్టను పెంచుకోవాలని యోచిస్తోందట. ఏదేమైనా తార‌క్ సినిమాలోని రైల్ డైలాగ్ ఇప్పుడు ఇండియా వైజ్‌గా పాపుల‌ర్ అవ్వ‌నుంది.

No comments:

Post a Comment