Thursday, 7 January 2016

రివ్యూ : కిల్లింగ్ వీరప్పన్

killing-veerappan-2822

రాం గోపాల్ వర్మ, సినీ అభిమానుల్లో ఈ పేరు తెలియని వాడు లేడు , ఈయన సినిమా అంటే అదో రకమైన క్రేజ్. గత కొద్ది సంవత్సరాలుగా ప్రేక్షకులందరూ ఈయన మంచి సినిమా తియ్యకపోతాడా అని చూస్తూనే ఉన్నారు, అయన పాటికి ఆయన తీస్తూనే ఉన్నాడు, ఆయన సినిమాలు తియ్యటంలో ఎంత బిజీ ఉంటాడు అంటే అసలు ముందు సినిమా హిట్ అయ్యిందా , ఫ్లాప్ అయ్యిందా అనేది కూడా పట్టించుకోనంత బిజీ. ఒక్కో సారి అసలు రిలీజ్ అయ్యిందో లేదో కూడా పట్టించుకోడు. అలాంటి వర్మ గారు మొదటి సారిగా కన్నడ లో రూపొంధించిన చిత్రం “కిల్లింగ్ వీరప్పన్ ” . వీరప్పన్ కథ కూడా అందరికి తెలిసిందే. దాదాపు దశాబ్దం పాటు మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పాలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించి చివరకు 2004 లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలొ హతమయ్యాడు. ఇలాంటి ఒక కథ ను తీసుకొని వర్మ రూపొందిస్తున్న చిత్రం అనగానే ప్రేక్షకుల్లో కొంచెం క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం వర్మ అంతకు ముందు రూపొందిచిన బయో ఎపిక్స్ రక్త చరిత్ర, అటాక్స్ 26/11 సినిమాలు రూపొందించిన విధానం కూడా ఒక కారణం. దానికి తోడు ఈ సినిమా కన్నడ లొ హిట్ టాక్ సంపాదించుకోవటం కూడా ఒక కారణం . కానీ వర్మ గత కొద్ది కాలంగా రూపొందిస్తున్న చిత్రాలతో పోలిస్తే పర్వాలేదు అనిపిస్తుంది కానీ, అసలైన వర్మ స్థాయిలో మాత్రం ఈ సినిమా లేదు అనే చెప్పాలి.
కథాంశం :
ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే . పేరుమోసిన గంధపు చెక్కల, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ (సందీప్ భరద్వాజ్) ని పట్టుకోవటం కోసం, ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమిస్తారు, ఆ ఫోర్స్ కమాండర్ ( శివరాజ్ కుమార్) వీరప్పన్ ని పట్టుకోవటం కోసం రకరకాల వ్యూహాలు పన్నుతుంటాడు, అలా ఒక వ్యూహం లో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి ( యజ్ఞ షెట్టి) ని ఒక శ్రేయ ( పారుల్ యాదవ్ ) తో ట్రాప్ చేయించి పట్టుకోవటం కోసం ప్రయత్నిస్తాడు, ఆ ప్రయత్నం లో కొంత మంది ఆఫీసర్స్ ని కోల్ఫోతాడు . ఆ తర్వాత మరో ఆపరేషన్ లో కూడా ఇలాగే దెబ్బతింటుంది, ఈ లోపు వీరప్పన్ తమిళ తీవ్రవాదులతో కలిసి,సినిమా స్టార్ రజనీ కాంత్ , కంచి శంకరాచార్య లాంటి ప్రముఖులను కిడ్నాప్ చేసే ప్రయత్నం లో ఉన్నాడు అని తెలుస్తుంది . ఆ ప్రయత్నాన్ని తెలివిగా డైవర్ట్ చేసి, వీరప్పన్ ని శ్రీలంక లో తమిళుల హక్కుల కోసం పోరాడుతున్న ప్రభాకరన్ తో కలిపిస్తాం అని తెలివిగా ట్రాప్ చేసి, అతన్ని చంపెయ్యటం తో కథ ముగిస్తుంది.
సాంకేతికాంశాల విషయానికొస్తే ఈ కథ ప్రేక్షకులందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పే అంశాలు ఏవీ లేవు కాబటి ప్రేక్షకుడి కి థ్రిల్లింగ్ అంశాలు ఏవి కనిపించవు, కానీ ఉన్న అంశాలను ఎంత థ్రిల్లింగ్ గా తెర మీద చూపగలిగాడు అనేది బేస్ చేసుకొనే సినిమా ప్రేక్షకాదరణ పోందుతుంది, వర్మ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నట్లే ఈ సినిమాలొ కూడా ఆ గ్రిప్పింగ్ అంశాలేవి పట్టించుకోలేదు. దానితో సినిమా సీన్ తర్వాత సీన్ వస్తూ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ పన్నిన ప్రతి వ్యూహం లో వీరప్పన్ చిక్కుకుంటూ తప్పించుకుంటూ ఊంటాడు . వీరప్పన్ ప్రతిది పకడ్బందీ వ్యూహం తో చేస్తాడు అని ఒక వైపు చెప్తూ అతన్ని ఈజీ గా ట్రాప్ లో కి లాగటం లో లాజిక్ కనపడదు, అలాగే వీరప్పన్ ఎవరినీ నమ్మడు అని చెప్తూనే పోలీసులు పంపిన ప్రతి వాడిని ఎలా నమ్మేస్తాడొ కూడా అర్ధం కాదు. వ్యూహం తర్వాత వ్యూహం అది ఫెయిల్ అయ్యాక మరో వ్యూహం, సినిమా అంతా ఇలాగే సాగుతుంటుంది, దానితో మొనాటనీ ఫీలింగ్ వస్తుంది . నిజానికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోరు లో చుట్టు పక్కల గ్రామస్తులు ఎలా నలిగిపోయింది , వారు ఎప్పుడు, ఎవరికి, ఎందుకు సపోర్ట్ చేశారు అనేది తెర మీద చూపించినట్లయితే సినిమాలో డ్రామా దొరికేది . కనీసం వీరప్పన్ ని బయట ప్రపంచానికి ఎక్కువ తెలీయచేసిన నక్కీరన్ గోపాల్ , గురించి ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా లేకపోవటం విచిత్రంగా గా ఉంటుంది. కథ ప్రారంభం అయ్యిందే కన్నడ స్టార్ రాజ్ కుమార్ కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యాక అనుకున్నా ఆ తర్వాత కూడా నక్కీరన్ గోపాల్ కి వీరప్పన్ కి మధ్య మీదియా బంధం ఉన్న సంగతి ఎక్కడా ప్రస్తావనలోకి రాదు . కనీసం మొదటి ఆపరేషన్ లో తప్ప ఆ తర్వాత ఎక్కడా కనీసం ముత్తులక్ష్మీ కూడా కనిపించకఫొవటం విచిత్రంగా ఉంది.
సాంకేతికాంశాలుః
సాంకేతికాంశాల విషయానికొస్తే ఈ కథ ప్రేక్షకులందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పే అంశాలు ఏవీ లేవు కాబటి ప్రేక్షకుడి కి థ్రిల్లింగ్ అంశాలు ఏవి కనిపించవు, కానీ ఉన్న అంశాలను ఎంత థ్రిల్లింగ్ గా తెర మీద చూపగలిగాడు అనేది బేస్ చేసుకొనే సినిమా ప్రేక్షకాదరణ పోందుతుంది, వర్మ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నట్లే ఈ సినిమాలొ కూడా ఆ గ్రిప్పింగ్ అంశాలేవి పట్టించుకోలేదు. దానితో సినిమా సీన్ తర్వాత సీన్ వస్తూ ఉంటుంది. టాస్క్ ఫోర్స్ పన్నిన ప్రతి వ్యూహం లో వీరప్పన్ చిక్కుకుంటూ తప్పించుకుంటూ ఊంటాడు . వీరప్పన్ ప్రతిది పకడ్బందీ వ్యూహం తో చేస్తాడు అని ఒక వైపు చెప్తూ అతన్ని ఈజీ గా ట్రాప్ లో కి లాగటం లో లాజిక్ కనపడదు, అలాగే వీరప్పన్ ఎవరినీ నమ్మడు అని చెప్తూనే పోలీసులు పంపిన ప్రతి వాడిని ఎలా నమ్మేస్తాడొ కూడా అర్ధం కాదు. వ్యూహం తర్వాత వ్యూహం అది ఫెయిల్ అయ్యాక మరో వ్యూహం, సినిమా అంతా ఇలాగే సాగుతుంటుంది, దానితో మొనాటనీ ఫీలింగ్ వస్తుంది . నిజానికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోరు లో చుట్టు పక్కల గ్రామస్తులు ఎలా నలిగిపోయింది , వారు ఎప్పుడు, ఎవరికి, ఎందుకు సపోర్ట్ చేశారు అనేది తెర మీద చూపించినట్లయితే సినిమాలో డ్రామా దొరికేది . కనీసం వీరప్పన్ ని బయట ప్రపంచానికి ఎక్కువ తెలీయచేసిన నక్కీరన్ గోపాల్ , గురించి ఎక్కడా కనీసం ప్రస్తావన కూడా లేకపోవటం విచిత్రంగా గా ఉంటుంది. కథ ప్రారంభం అయ్యిందే కన్నడ స్టార్ రాజ్ కుమార్ కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యాక అనుకున్నా ఆ తర్వాత కూడా నక్కీరన్ గోపాల్ కి వీరప్పన్ కి మధ్య మీదియా బంధం ఉన్న సంగతి ఎక్కడా ప్రస్తావనలోకి రాదు . కనీసం మొదటి ఆపరేషన్ లో తప్ప ఆ తర్వాత ఎక్కడా కనీసం ముత్తులక్ష్మీ కూడా కనిపించకఫొవటం విచిత్రంగా ఉంది .
రమ్మీ సినిమాటోగ్రఫీ సొ సో గా ఉంది. శాండీ బ్యాగ్రౌండ్ మ్యుజిక్ గతంలో వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర బ్యాగ్రౌండ్ స్కోర్ నే కొద్దిగా మార్చి దీనిలొనూ వాడారా అనిపించేలా ఉంది . రవిశంకర్, రాజశేఖర్ రూపొందిచిన సంగీతంలో ఒక్క పాట కూడా , పాట అయ్యాక గుర్తుండే అవకాశం లేదు
నటీనటుల పెర్ ఫార్మెన్స్ విషయనికొస్తే వర్మ సినిమాలలో ఏమి జరిగినా, జరగకపొయినా అయా నటుల దగ్గరనుండి నటన మాత్రం రాబట్టుకోగలుగుతాడు . ఈ సినిమాలో కూడా ముందుగా చెప్పుకోవాల్సింది వీరప్పన్ గా నటించిన సందీప్ భరద్వాజ్ గురించి, వీరప్పన్ నిజంగా ఇంత భయంకరంగా ఉంటాడా అనిపించేలా ఉంటుంది ఈయన నటన, ముఖ్యంగా పోలీసాఫీసర్ గొంతు కోసే సమయంలో కరుడు కట్టిన నేరస్తుడిలా, మానవత్వం లేని మనిషిలాగే మనకు కనిపిస్తాడు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ గురించి తాస్క్ ఫోర్స్ కమాండర్ గా అధ్బుతంగా నటించాడు అనే చెప్పాలి. ఒక రాక్షసుడిని అంతమొందిచటానికి అవసరమైతే రాక్షసుడిగా మారినా తప్పు లేదు అనే సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తిగా , నేరస్తుల పట్ల ఏ మాత్రం జాలి చూపించని , కర్కశుడైన పొలీసాఫీసర్ గా ఈయన నటన అమోఘం అనే చెప్పాలి , యజ్ఞాషెట్టి , పారుల్ యాదవ్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు
సినిమాలో ఏ మాత్రం థ్రిలింగ్ అంశం లేకపోవటం తో డాక్యు థ్రిల్లర్ గా రూపొందాల్సిన సినిమా ఒక డాక్యూ డ్రామ గా ,ఆ డ్రామ కూడా ప్రేక్షకులకు నచ్చే అవకాశం లేకపోవటం సినిమాకు మైనస్ పాయింట్. సినిమా చూస్తున్నంత సేపు మనకు ఒక వయెలంట్ డాక్యుమెంటరీ చూస్తున్నట్లుంటుంది తప్ప సినిమాలా ఉండదు . కానీ గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న వర్మ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా 2 గంటల సేపు కూర్చొబెడుతుంది అనటం లో సందేహం లేదు
రేటింగ్ 2.25/5
-మోహన్ రావిపాటి
please share it..

No comments:

Post a Comment