Sunday 31 January 2016

ఫ‌స్ట్ టైం తొడ‌గొట్టిన చంద్ర‌బాబు

0850450120

సినిమాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాలు విసిరిన సంద‌ర్భాల్లో హీరోలో తొడ‌గొట్ట‌డం చూస్తుంటాం. తెలుగు సినిమాల‌లో తొడ‌కొట్టాలంటే యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌ర్వాతే ఎవ‌రైనా… ఇప్పుడు వీటిని చంద్ర‌బాబు స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో.. తొలిసారిగా తొడ‌గొట్టి ప్ర‌త్య‌ర్థుల‌కు స‌వాలు విసిరారు. ఇప్ప‌టివ‌రకూ ఇత‌ర పార్టీల నేత‌ల‌పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే త‌ప్ప‌.. ఏనాడూ ఇలా బ‌హిరంగంగా స‌వాలు విసిరింది లేదు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న చంద్ర‌బాబు ఇలా ప్ర‌త్య‌ర్థుల‌ను ఇలా హ‌డ‌లెత్తించార‌నుకుంటే పొర‌ప‌డిన‌ట్టే. విశాఖ‌లో జ‌రుగుతున్న ప్రో క‌బడ్డీ ప్రారంభ‌ పోటీల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆ స‌మ‌యంలో ఆయ‌న తొడ‌కొట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.
తెలుగు టైటాన్స్- యు ముంబకి మ‌ధ్య ప్రోక‌బ‌డ్డీ మ్యాచ్ శనివారం జ‌రిగింది. గ్రేట‌ర్ ప్రచారంలో ఉన్న చంద్ర‌బాబు.. విశాఖ‌కు చేరుకుని అక్క‌డ ప్రో క‌బ‌డ్డీ పోటీల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తొడ‌కొట్టి ప్రేక్ష‌కుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఆయ‌న చిన్న‌నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీలో ఒలింపిక్స్ నిర్వ‌హించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు. అందులో అన్ని క్రీడ‌ల‌తోపాటు క‌బ‌డ్డీ కూడా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టేడియాల‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మానికి బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆమీర్‌ఖాన్ కూడా వ‌చ్చారు. తరువాత ఇద్ద‌రూ క‌లిసి మ్యాచ్‌ను వీక్షించారు. ఏది ఏమ‌యినా.. చంద్ర‌బాబు నాయుడు తొడ‌గొట్ట‌డం ఇప్పుడు పెద్ద విశేషంగా మారింది.

No comments:

Post a Comment