Thursday 28 January 2016

బాల‌య్య సినిమాలంటే క‌విత‌కు అంత ఇష్ట‌మా

tt7014502010

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు నందమూరి తార‌క రామారావు అంటే ఇష్టం. ఆయ‌నంటే అభిమానం ఉండ‌బ‌ట్టి.. త‌న కొడుక్కి తార‌క రామారావు అని పేరుపెట్టుకున్నారు. తండ్రి ఒక హీరో సినిమాల‌ని.. వాళ్ల పిల్ల‌లు ఆ హీరోల పిల్ల‌ల సినిమాల‌ను సాధార‌ణంగానే ఇష్ట‌ప‌డుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ కుమార్తెకు కూడా సీనియ‌ర్ న‌టుడు ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ సినిమాలంటే అంత ఇష్ట‌మా? ఆమె కూడా బాలయ్య సినిమాల‌ను చూస్తుంటారా? అంద‌రిలానే బాలయ్య న‌ట‌న అంటే ఇష్ట‌మేనా? అంటే అవున‌నే సంకేతాలిస్తున్నాయి తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు.
`కాంగ్రెస్‌కు 15 సీట్లు వ‌స్తే రాజీనామా చేస్తా` అంటూ త‌లసాని స‌వాలు! `టీఆర్ఎస్‌కు 100 సీట్లు వ‌స్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా` అని మ‌రో నేత శ‌ప‌థం.. ఇలా నేత‌ల స‌వాళ్లు.. ప్ర‌తిస‌వాళ్లు గ్రేట‌ర్ ప్ర‌చారంలో తెగ వినిపిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ ఎవ‌రు అభివృద్ధి చేశారు అనే కూడా కీల‌కంగా మారింది. ఇప్ప‌డు ఈ అంశాల‌పై నిజామాబాద్ ఎంపీ క‌విత స్పందించారు. అంతేకాదు ఈ సంద‌ర్భంలో బాల‌య్య సినిమాల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. తొడగొట్టి సవాల్ చేయడానికి ఇదేమన్నా బాలకృష్ణ సినిమానా? అని అమె ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ లో జర్నలిస్ట్ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్దికి ఏం చేయదలిచారో చెప్పాలే కాని.. తొడలు కొట్టుకుని, సవాళ్లు విసురుకోవడానికి ఇది బాలయ్య బాబు సినిమా కాదన్నారు. నగర అభివృద్దికి ఏం చేయాలని అనుకుంటామో తాము అదే చెబుతామన్నారామె. ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. వీట‌ని బ‌ట్టి బాలయ్య సినిమాలను క‌విత చూస్తార‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది.

No comments:

Post a Comment