Thursday 7 January 2016

ట్విట్ట‌ర్‌లో ఈ ప‌దాలు బ్యాన్‌

045042120120

అస‌భ్య‌క‌ర పోస్టుల‌కు, ప‌దాల‌కు ట్విట్ట‌ర్ చెక్ పెట్టింది. నెటిజ‌న్లు చేసే ట్వీట్ల‌లో అభ్యంత‌రక‌ర ప‌దాలు ఉండకూడ‌ద‌ని ట్విట్ట‌ర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డిక్ కాస్టోలో వెల్ల‌డించారు. ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని, ఉగ్ర‌వాదం పేరిట ఏ వ్యాఖ్య‌లూ ఉండ‌కూడ‌ద‌ని, ఎవ‌రినైనా వేధించేలా, కించ‌ప‌రిచేలా ట్వీట్లు చేస్తే వాటిని అంగీక‌రించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా కొత్త నిబంధ‌న‌లు మీరితే, వారి ఖాతాల‌ను తాత్కాలికంగా లేదా శాశ్వ‌తంగా స‌స్పెండ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కొత్త నిబంధ‌న‌ల‌పై క‌స్ట‌మ‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌న్నారు.
ఇటీవ‌ల ఓ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం, నెటిజన్ల‌లో 73శాతం మంది ఆన్‌లైన్ వేధింపుల‌ను చ‌విచూస్తున్నార‌ని తెలిపింది. ఈ ప‌రిస్థ‌తిల‌లో మార్పు రావాలంటే ఈ నిబంధ‌న‌లు పాటించి తీరాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు “అబ్యూజ్ అండ్ స్పామ్” సెక్ష‌న్ ప్రారంభించామ‌ని, ఇందులో భాగంగా ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల‌కు చెక్ చెప్ప‌నున్నామ‌ని ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం వెల్ల‌డించింది. హింస పెరిగేలా మీరు వ్యాఖ్య‌లు చేయ‌రాదు. ప్ర‌త్య‌క్షంగా గానీ, ప‌రోక్షంగా గానీ మ‌రో వ్య‌క్తి మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్యాఖ్య‌లు, జాతి వివ‌క్ష‌, లింగ వివ‌క్ష‌, మ‌త‌ప‌ర‌మైన వ్యాఖ్య‌లు, వ్య‌క్తికున్న రుగ్మ‌త‌లు, విక‌లాంగ‌త్వాన్ని సూచించే వ్యాఖ్య‌ల ప్ర‌స్తావ‌న ఇక‌పై ట్వీట్ల‌లో ఉండ‌రాదు అని ట్విట్ట‌ర్ పేర్కొంది.
please share it..

No comments:

Post a Comment