Friday 1 January 2016

రివ్యూ : అబ్బాయితో…అమ్మాయికి ……పెద్ద కన్ ఫ్యూజ్

abbayitho-ammayi-review-828

“ఊహలు గుస గుస లాడే” , “లక్ష్మీ ..రావే మా ఇంటికి” లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లతో యూత్ కి దగ్గరయిన హీరో నాగశౌర్య .ఇప్పుడు నాగ శౌర్య సినిమాలు అంటే యువత, ముఖ్యంగా అమ్మాయలు ఇష్టపడతారు . రమేష్ వర్మ దర్శకత్వం లో నాగశౌర్య నతించిన “అబ్బాయితో ..అమ్మాయి “.ఈ సినిమాకు జనవరి 1వతేదీ అయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇంత కన్ ఫ్యూజన్ సినిమా చూడలేదు, అసలు దర్శకుడు ఏమి చెప్పాలి అనుకున్నడో ఎవ్వరీఈ అర్ధం కాదు. కనీసం దర్శకుడికైనా అర్ధం అయ్యిందో లేదో !!
కథాంశం :
అభి (నాగశౌర్య),ఇంజనీరింగ్ చదివే కుర్రాడు, ప్రార్ధన ( పల్లక్ లల్వాని) అనే అమ్మాయితో ఫేస్ బుక్ లో పరిచయం అవుతారు . ఇద్దరూ పవన్ కళ్యాణ్, సమంత అనే పేరుతో మాట్లాడుకుంటుంటారు ఇద్దరు ఒకరికొకరు మంచి స్నేహితులవుతారు. ఒకరినొకరు ఎప్పటికీ చూసుకోకుండా స్నేహితులుగా ఉండిపోదాము అనుకుంటారు. ఇదిలా జరుగుతుండగానే అభి,ప్రార్ధన ఆఫ్ లైన్ లో ఒకరికొకరు పరిచయం అవుతారు. అభి ఎలాగైనా ప్రార్ధనను ప్రేమ లోకి దించాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. చివరకు ప్రార్ధనను ప్రేమలోకి దించుతాడు. ఒకరోజు ప్రార్ధన ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒకటవుతారుఈ సంగతి తెలిసిన ఇద్దరి తల్లిదండ్రులు ఆగ్రహిస్తారు, అదే సమయంలో అభి తనను మోసం చేశాడు అని ప్రార్ధన కు తెలుస్తుంది. అప్పటినుండి అభిని అసహ్యించుకుంటుంది. ఆన్ లైన్ లో పవన్ కళ్యాణ్ గా పరిచయం అయిన అభి తో క్లోజ్ గా మాట్లాడుతూ అతని సహకారంతో రొటీన్ లైఫ్ లో పడుతుంది. ఇంతకీ ఆన్ లైన్ లో వేరే పేర్ల తొ పరిచయం అయిన వాళ్ళు ,ఆఫ లైన్లో పరిచయం అయిన వాళ్ళు ఒకరే అన్న విషయం ఇద్దరికీ తెలిసిందా లేదా ?? ఒకరినొకరు కలుసుకున్నారా లేదా అనేది మిగతా కథ
సాంకేతికాంశాలు :
సాంకేతికాంశాల విషయానికొస్తే సినిమా స్క్రీన్ ప్లే అంతా కన్ ఫ్యూజింగా , ఏ మాత్రం లాజిక్ లేకుండా ఉంటుంది. ఆన్ లైన్ లో స్నేహితులుగా పరిచయం అయిన ఇద్దరూ ఫోన్లో కూడా మాట్లాడేసుకుంటుంటారు , ప్రేమికులుగా కూడా ఇద్దరూ ఫోన్లో మాట్లడేసుకుంటుంటారు , కానీ అదే ఫోన్ నెంబరు అనే విషయం ఎందుకు తెలియదో దర్శకుడే చెప్పాలి, పోనీ ఇది వదిలేసినా, సినిమాలో అన్ని పాత్రలు కూడా ఇలాగే గందరగోళంగా ప్రవర్తిస్తుంటాయి. హిరోయిన్ తండ్రి , ఎందుకు కూతురుని ,సడెన్ గా ద్వేషించాడో,అలాగే హిరొ ని ఎందుకు ద్వేషించాడో, తిరిగి సడెన్ గా ఎందుకు ప్రేమించాడో, సేం హీరో తండ్రి (మోహన్) కూడా అంతలా ప్రేమించే కొడుకు ని సడెన్ గా ఎందుకు ద్వేషించాడొ, అర్ధం కాదు. అసలు ఈ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. ఇళయరాజా మ్యూజిక్ మాత్రం సూపర్బ్. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కథ కి ఏ మాత్రం సింక్ కాకపోయినా, ఎమోషనల్ సీన్ లా ఫీల్ అయ్యాము అంటే దానికి కారణం ఇళయరాజానే. పాటలు కూడా బాగానే ఉన్నాయి. శ్యాం .కె.నాయుడు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేం కలర్ ఫుల్ గా,అందంగా కనిపిస్తుంది కానీ,ఆ ఫ్రేం కి సినిమా కి సంబంధం మాత్రం అర్ధం కాదు.
నటీనటుల పెర్ ఫార్మెన్స్ విషయానికొస్తే నాగ శౌర్య స్క్రీన్ మీద క్యూట్ గా అందంగా కనిపిస్తాడు. నటన పరంగా కూడా ఆకట్టుకున్నాడు కానీ, ఈ కన్ ఫ్యూజన్ స్క్రీన్ ప్లే మహత్యమేమో, సడెన్ గా ఓవర్ ప్లే చేస్తాడు. ఇక పల్లక్ లల్వాని నటన, అందం రెండూ పర్వాలేదు అనే స్థాయిలోనే ఉన్నాయి .ఇక రావు రమేష్, ఈ మధ్య కాలంలో తన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న ఈయన ఈ సినిమాలో మాత్రం ఎందుకు అరుస్తున్నడొ అర్ధం కాకుండా అరిచేస్తుంటాడు,విపరీతంగా ప్రవర్తిస్తుంటాడు. మౌనరాగం మోహన్ కి దక్కింది అతి సాధారణ పాత్ర , చెప్పుకోవటానికి కానీ, చెయ్యటానికి కానీ ఏమీ లేదు. అసలు ఈ పాత్రం ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో తెలీయకపోవటం వల్ల ఎవరి నటన బాగున్నా, అది కనీసం గుర్తించే అవకాశం కూడా ప్రేక్షకుడికి ఉండదు.
ఏ మాత్రం కథ కానీ కథనం కానీ లేకుండా , ప్రతి ఫ్రేం ని అందంగా చూపించాలని ప్రయత్నించి , ఫ్రేం మిద పెట్టిన శ్రద్ద లో కనీసం పదోవంతు కూడా కథ మీద పెట్టకపోవటం తో ,ఈ సినిమాలో అసలు దర్శకుడు ఏమి చెప్పాలనుకున్నాడో, అసలు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ చెప్తున్నాడో కూడా అర్ధం కాదు. ప్రేమ కన్నా స్నేహం గొప్పది అన్నాడో అనలేదో, పోనీ కెరీర్ గొప్పది అన్నాడో, అనలేదో ఏమీ అర్ధం కాదు. కనీసం సరైన కథ లేకపోయినా, స్క్రీన్ ప్లే లేకపోయినా, కన్ ఫ్యూజన్ మాత్రం సినిమా కు ఉండకూడదు . టోటల్ గ ఈ సినిమా ప్రేక్షకులకు తప్ప ఏమీ మిగల్చదు
రేటింగ్ : 1.25/5
-మోహన్.రావిపాటి
please share it..

No comments:

Post a Comment