రాజమౌళి అభిమాన హీరో ఎవరో తెలుసా

ఓటమి ఎరుగని దర్శక
ధీరుడు ఎస్ ఏజ్ రాజమౌళి అభిమాన హీరో ఎవరో తెలుసా ......... ఇంకెవరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . స్టూడెంట్ నెంబర్ వన్ , సింహాద్రి ,యమదొంగ వంటి హిట్ చిత్రాలను ఎన్టీఆర్ తో చేసాడు జక్కన్న . అసలు దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిందే ఎన్టీఆర్ సినిమాతో అయితే మొదట్లో ఎన్టీఆర్ ని చూసి డ్రమ్ము లా ఉన్నాడు వీడు హీరో ఏంటి ? అని అనుకున్నాడట కానీ కలిసి మాట్లాడుకున్నాక కొంత నమ్మకం కుదిరింది ఆ తర్వాత షూటింగ్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ అంటే అభిమానం ఏర్పడింది దాంతో ఎన్టీఆర్ తో మూడు సినిమాలు చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యుడి లా ఫీలౌతాడు జక్కన్న . ఇక ఎన్టీఆర్ కూడా అంతే జక్కన్న అన్నా ! జక్కన్న కుటుంబం అన్నా చాలా ప్రేమగా ఉంటాడు . రాజమౌళి కి జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట , ఈ విషయాన్నీ ఇటీవల చెన్నై వెళ్ళినప్పుడు వెల్లడించాడు జక్కన్న .
No comments:
Post a Comment