సెక్స్ రాకెట్ పై రచ్చ రచ్చ

ఆంధ్రప్రదేశ్ లో సెక్స్ రాకెట్ వివాదం పెద్ద రచ్చ అవుతోంది . కాల్ మనీ వ్యవహారం తో ముడిపడి ఉన్న ఈ సెక్స్ రాకెట్ పై లోతుగా చర్చ జరగాలని నిందితులను కటినంగా శిక్షించాలని ప్రతిపక్షం కోరుతుండగా ,నిందితులలో ఎంతటి పెద్ద వాళ్లున్నా వదిలే ప్రసక్తి లేదని అధికార పార్టీ చెబుతున్నప్పటికీ జగన్ అండ్ కొ మాత్రం ఈ సెక్స్ రాకెట్ వెనకాల టిడిపి శ్రేణులే ఉన్నాయని ఆరోపిస్తూ అసెంబ్లీ లో రచ్చ రచ్చ చేసారు . ఈ వివాదం ఎంతగా చెలరేగిందంటే రోజా ని ఏకంగా సంవత్సరం పాటు సస్పెండ్ చేసేంత వరకు . రోజా చంద్రబాబు పై అతిగా ఆరోపణలు చేయడంతో స్పీకర్ కోడెల రోజా ని సంవత్సరం పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించారు . కాల్ మనీ సెక్స్ రాకెట్ లో పలు పార్టీలకు సంబందించిన వ్యక్తులు ఉన్నట్లు అధికారులు లెక్కలతో సహా వెల్లడిస్తున్నారు . ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి .
No comments:
Post a Comment