Thursday 31 December 2015

ఎక్కువ సేపు కూర్చుంటే అంతే…

44781451401

రోజులో ఎక్కువ‌మంది ప‌నిచేసే ప్ర‌దేశంలో చాలా సేపు కూర్చుండిపోవ‌డం గానీ, ఫోన్‌తో ఎక్కువ సేపు క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం గానీ చేస్తూ ఉంటారు. మీకు కూడా అలాంటి అల‌వాటు ఉంటే వెంట‌నే త‌గ్గించుకోండి.. లేకపోతే.. మీ ప‌ని అంతే అంటున్నాయి అధ్య‌య‌నాలు. ఎందుకంటే మెల‌కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఎక్కువ సేపు కూర్చుంటే మృత్యువుకు స్వాగతం ప‌ల‌క‌డ‌మేనట‌. దీనివ‌ల్ల హృద్రోగాలు, కేన్స‌ర్‌, ముఖ్యంగా మ‌ధుమేహం, వంటి వ్యాధులు వచ్చే ముప్పు అధికంగా ఉంద‌ని అధ్య‌య‌నాల్లో తేలింది. వీటితో పాటు ఆయుష్ ప్ర‌మాణం కూడా పూర్తిగా త‌గ్గిపోతుంద‌ని శాస్త్రవేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. బరువు పెర‌గ‌డానికి ఎక్కువసేపు కూర్చోవడం కూడా కార‌ణ‌మ‌వుతుంది. దీంతో పెరిగిన బ‌రువును తగ్గించుకునేందుకు రోజుకు ఒక గంట వ్యాయామం చేసి మిగిలిన స‌మ‌యం అంతా విశ్రాంతి తీసుకుంటారు. అటువంటి వారు ఒక గంట వ్యాయామం చేసినా ఏవిధ‌మైన ఫ‌లితం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. యువ‌త స‌గ‌టున 50 నుంచి 70 శాతం కూర్చునే ఉంటున్నాని అధ్య‌య‌నంలో తేలింది. అయితే వారు ఈ స‌మ‌యాన్ని త‌గ్గించుకోవ‌డం ద్వారా కేన్స‌ర్‌లు, హృద్రోగాలు, మధుమేహ బారిన ప‌డే ముప్పు త‌క్కువ‌గా ఉంద‌ని తెలిపారు. ఎక్కువసేపు కుర్చొవ‌డానికీ, స్త్రీ, పురుషుల‌కూ మ‌ధ్య తేడా ఉంద‌ని తేలింది. మహిళ‌లు ఎక్కువసేపు కూర్చుంటే వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 10 శాతం పెరుగుతాయట‌.
please share it..

No comments:

Post a Comment