Friday 25 December 2015

టాలీవుడ్ కు త్రివిక్ర‌మ్ గుడ్ బై

టాలీవుడ్ కు త్రివిక్ర‌మ్ గుడ్ బై

5174514514

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ కి గుడ్ బై చెప్ప‌బోతున్నారా..! కోలీవుడ్ లో మ‌కాం వేయ‌నున్నారా..! ప్రస్తుతం నితిన్ తో చేస్తోన్న మూవీ “అ..ఆ ” పూర్త‌వ్వ‌గానే.. ఓ ద్విభాషా చిత్రానికి సైన్ చేస్తాడని, ఇప్ప‌టికే ప్రాజెక్ట్ కి సంబంధించి త్రివిక్రమ్ అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాడని టాక్‌. సూర్య హీరోగా నిర్మిత‌మ‌య్యే ఈ సినిమాకు ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్లు అని తెలుస్తోంది. వారిలో ఒక‌రు సూర్య స‌న్నిహితుడు జ్ఞానవేల్ రాజా కాగా మ‌రొక‌రు త్రివిక్రమ్ కి సన్నిహితుడైన హారిక, హాసిని మూవీస్ అధినేత రాధాకృష్ణ (చినబాబు).
త్రివిక్రమ్ చెప్పిన ఓ స్టోరీ లైన్ సూర్యకు బాగా నచ్చడంతో ఈ ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వెనువెంటనే హ‌రి డైరెక్ష‌న్లో ‘సింగమ్ 3’ చిత్రం చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం వ‌హించే సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడ‌ట సూర్య. వచ్చే ఏడాది జూలైలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారమ్. ఇఫ్ ఆల్ గోస్ వెల్‌.. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న తొలి ద్విభాషా చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనుకుంటున్నాడట త్రివిక్రమ్.

No comments:

Post a Comment